మరో స్టార్ హీరోకు అమ్మగా శివగామి.. సినిమా ఏంటో తెలుసా..? స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో సారి తల్లి పాత్రలో కనిపించనుంది. నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమాలో రమ్యకృష్ణ నానికి మదర్ రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. By Archana 29 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update ramyakrishna షేర్ చేయండి Ramya Krishnan: నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెలతో ' ది ప్యారడైస్' మూవీ చేస్తున్నారు. గతేడాది వీరిద్దరి కాంబోలో వచ్చిన దసరా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నాని కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న 'ది ప్యారడైస్' పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి నాని కోసం సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! నానికి అమ్మగా రమ్యకృష్ణ ఇది ఇలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే రమ్యకృష్ణకు తల్లిపాత్రలు కొత్త కాదు. బాహుబలి తర్వాత ఆమె పోషించే పాత్రలకు మరింత పెరిగిపోయింది. ఇప్పటికే ప్రభాస్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు తల్లి పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక ఇప్పుడు నాని వంతు వచ్చింది. 'ప్యారడైస్' మూవీలో రమ్యకృష్ణ నానికి తల్లిగా కనిపించబోతున్నారు. Also Read: నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్! 'దసరా' మూవీతో పోలిస్తే ప్యారడైస్ వంద రెట్లు అధిక ప్రభావం చూపించే కథ అని మూవీ టీమ్ చెబుతూ వస్తోంది. ఇప్పటికే మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్ చూస్తుంటే.. ఈసారి శ్రీకాంత్ ఓదెల నానితో ఎదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది కాగా ఈ సినిమాలో నాని సరసన జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి