Andhra King: రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'కు మొంథా తుఫాను దెబ్బ.. నెక్స్ట్ ప్లాన్ ఇదే..!

రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ రెండో పాట ఈవెంట్ వైజాగ్‌లో జరగాల్సి ఉండగా, మెంథా తుఫాన్ వల్ల రద్దు చేశారు. సాంగ్‌ను హైదరాబాద్‌లో లేదా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్ ఉంది. నవంబర్ 28న సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

New Update
Andhra King

Andhra King

Andhra King: యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “ఆంధ్రా కింగ్ తాలూకా” (RAPO 22) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్ సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తుండగా, టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.

ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రామ్ స్వయంగా రాసిన ‘నువ్వుంటే చాలే’ అనే ఫస్ట్ సాంగ్ కూడా యూత్‌కి బాగా నచ్చి, మ్యూజిక్ ఛార్ట్స్‌లో టాప్‌లో నిలిచింది. దీంతో సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

వైజాగ్‌లో భారీ ప్లాన్..

మేకర్స్ ఈ నెల 31న రెండో పాట విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో భారీగా ప్లాన్ చేశారు. అయితే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన మెంథా తుఫాన్ కారణంగా వైజాగ్‌లో వర్షాలు, వరదలతో పరిస్థితి తీవ్రంగా మారింది. నగరంలో నీరు నిలవడంతో, ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని టీమ్ ఈ ఈవెంట్‌ను రద్దు చేసింది.

సినిమా టీమ్ ఇప్పుడు ఆ సాంగ్‌ను హైదరాబాద్‌లో ఈవెంట్ ద్వారా రిలీజ్ చేయాలా లేదా నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేయాలా అనే విషయంపై ఆలోచిస్తోంది. రామ్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఈ సినిమాకు వివేక్ శివ, మెర్విన్ సోలోమన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎంటర్టైన్‌మెంట్ ఉండే ఈ చిత్రం రామ్ అభిమానులకు పండగ కానుంది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’లో రామ్ పూర్తిగా కొత్త లుక్‌తో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.

మొత్తానికి, తుఫాన్ కారణంగా ఈవెంట్ రద్దయినా, రామ్ అభిమానుల్లో సినిమా పై ఉన్న హైప్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నవంబర్ 28న థియేటర్లలో రామ్ మాస్ జాతర ప్రారంభం కాబోతోంది.

Advertisment
తాజా కథనాలు