Ram Gopal Varma: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడినా అది నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంది. అలాంటిది సెక్స్ గురించి మాట్లాడితే ఇంకేమన్నా ఉందా? సోషల్ మీడియా అంతా ఆయన కామెంట్స్ తోనే ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఆర్జీవీ.. ఎలాంటి టాపిక్ అయినా సరే కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడుతారు. ముఖ్యంగా సమాజం అంతా మాట్లాడటానికి భయపడే సెక్స్, బోల్డ్, వల్గారిటీ లాంటి విషయాల్లో ఆయన చాలా ఓపెన్‌గా ఉంటారు.
అంచనా వేయడం చాలా కష్టం..
ఇప్పటికే ఆయన ఎన్నోసార్లు తన బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలవగా.. తాజాగా మరోసారి సెక్స్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆర్జీవీ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెక్స్, వర్జినిటీ లాంటి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 17, 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన వర్జినిటీని కోల్పోయానని, బెడ్‌పై ఒక అబ్బాయి శృంగారంలో పాల్గొనే సామర్థ్యాన్ని అంచనా వేయడం చాలా కష్టమని అన్నారు.
ఇక చాలు ఆపు అని ఏ అమ్మాయి ఇంతవరకు తనతో చెప్పలేదని, డేట్‌కు వెళ్లడం తనకు నచ్చదని, ఏదైనా ఇంట్లోనే అని చెప్పాడు. 'మీరు అమ్మాయిలనేనా లేదంటే ఆంటీలను కూడా ఇష్టపడుతారా..?' అని యాంకర్ అడగ్గా..' ఇద్దరిని అని వర్మ, ఎవరిలో ఉండే అట్రాక్షన్ వారిలో ఉంటుందని, అనుభవం ఉన్న వాళ్లు ఏ రంగంలోనైనా డామినేట్ చేస్తారని, అదే సూత్రం బెడ్రూమ్కు కూడా వర్తిస్తుందని వ్యాఖ్యానించారు.
Also Read : 'దేవర'లో బాబీ డియోల్ సీన్ తీసేసారు, అన్నీ పార్ట్-2 లోనే : దేవర యాక్టర్స్
తాజాగా మరో ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో చూడటంవల్ల, లేదంటే ఎవరైనా చెప్పడంవల్ల మహిళల గురించి కొన్ని అపోహలు ఏర్పడతాయి. పురుషుడు శృంగారానికి ముందు మహిళతో ఎక్కువగా మాట్లాడుతాడు. స్త్రీలు మాత్రం శృంగార కార్యం ముగిసిన తర్వాత మాట్లాడతారు.
శృంగారానికి ముందు అమ్మాయిని కన్విన్స్ చేయడానికే మగాడు ప్రయత్నిస్తాడు. కానీ మహిళ మాత్రం శృంగారం తర్వాత అతనితో ఎమోషనల్‌గా కనెక్టయ్యి మాట్లాడుతుంది. పురుషుడు ఎప్పుడైతే తన శారీరక వాంఛ తీరిందో ఇక ఆమెతో సంబంధం లేదన్నట్లుగా పక్కకి తిరిగి పడుకుంటాడు అని ఆర్జీవీ అన్నారు. దీంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి.