/rtv/media/media_files/2025/11/01/peddi-update-2025-11-01-15-49-37.jpg)
peddi update
Peddi: రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో కథానాయికగా నటిస్తున్న జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. లంగావోణీ, కళ్ళద్దాలతో జాన్వీ మాస్ లుక్ అదిరిపోయింది. ఇందులో జాన్వీ 'అచ్చియ్యమ్మ' అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ''ఫైర్ బ్రాండ్ యాటిట్యూడ్ తో మన పెద్ది లవర్'' అంటూ జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ జాన్వీ లుక్ చూస్తుంటే.. సినిమాలో ఆమె క్యారెక్టర్ ఫుల్ మాస్ గా ఉండబోతుందని తెలుస్తోంది.
Our #Peddi's love with a firebrand attitude 😎🔥
— BuchiBabuSana (@BuchiBabuSana) November 1, 2025
Presenting the gorgeous #JanhviKapoor as #Achiyyamma ❤🔥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/mdU2a3oxp6
వచ్చే ఏడాది విడుదల
గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఇందులో రామ్ చరణ్ క్రికెటర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ లుక్ విడుదల చేయగా.. ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చింది. 'రంగస్థలం' సినిమా మాదిరిగానే ఇందులో కూడా చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో పక్కా పల్లెటూరి కుర్రాడిలా కనిపించబోతున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మేకర్స్ సంయుక్తంగా భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'గేమ్ ఛేంజర్' భారీ డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమా విజయం చరణ్ కి కీలకమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Follow Us