/rtv/media/media_files/2025/08/19/ram-charan-peddi-look-2025-08-19-19-58-11.jpg)
ram charan peddi look
Ram Charan Peddi Look: రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్న 'పెద్ది' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా మూవీ టీమ్ నుంచి విడుదలైన ఓ వీడియో నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ 'పెద్ది' లో తన కొత్త మేకోవర్ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షార్ట్ వీడియో, మూవీ పోస్టర్లలో పొడవడి జుట్టు, ముదురు గడ్డంతో చరణ్ లుక్ కనిపంచగా.. ఇప్పుడు మరో కొత్త లుక్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చరణ్ 'పెద్ది' లో టూ డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడా? అనే డౌట్ మొదలైంది అభిమానుల్లో.
Power-Packed Looks are Getting Locked for #PEDDI 💪🔥
— PEDDI (@PeddiMovieOffl) August 17, 2025
Global Star @AlwaysRamCharan & Visionary @BuchiBabuSana are all Set to Unleash a Storm on Screen! 🔥#Peddipic.twitter.com/WBHdDccigo
ఇండియాలోనే బెస్ట్ స్టైలిస్ట్
చరణ్ కొత్త మేకోవర్, దానికి సంబంధించిన స్టైలింగ్ కోసం మూవీ టీమ్ భారతదేశపు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తో కలిసి పనిచేస్తున్నారు. ఆలిమ్ హకీమ్ సెలబ్రిటీల హెయిర్ స్టైల్స్ కి బాగా పాపులర్. ఈ లుక్ కి సంబంధించి చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు.. ఆలిమ్ సెలూన్ లో చర్చిస్తున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. ఇది విడుదలైనప్పటి నుంచి ఫ్యాన్స్ లో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఆలిమ్ హకీమ్ మేకోవర్ తో రామ్ చరణ్ ఇంతక ముందెప్పుడూ చూడని లుక్ లో కనిపించబోతున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
GlobalStar Gets a New Look 💫#RamCharan is all set to unleash yet another untapped look of his in #PEDDI 🔥🔥
— Thyview (@Thyview) August 19, 2025
A @AalimHakim Styling 💥🤘@AlwaysRamCharan@MythriOfficial@BuchiBabuSana@vriddhicinemaspic.twitter.com/eMkDOKEycl
గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. ఆస్కార్ విజేత ఎ.ఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
స్టార్ కాస్ట్
ఇందులో బాలీవుడ్ బ్యూటీ జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే శివారజ్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదలవగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఆయన గౌర్నాయుడు పాత్రలో కనిపించబోతున్నారు.