/rtv/media/media_files/2024/10/31/qza5PFNoIQPHntqhweqq.jpg)
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్' నుంచి నేడు దీపావళి పండుగను పురస్కరించుకొని అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ నవంబర్ 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ లుంగీ కట్టి మాస్ లుక్ లో అదరగొట్టాడు.
చరణ్ లుక్ అదుర్స్..
ట్రైన్ పట్టాల మీద రౌడీలను పడుకోబెట్టి వాళ్ళ ముందు రామ్ చరణ్ కూర్చున్న ఫోజ్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఈ పోస్టర్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలై చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ రెండు సాంగ్స్ విజువల్ గా ఎంతో గ్రాండియర్ గా ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Light it up 😎💥 #GameChangerTeaser from November 9th. Wishing everyone a very Happy Diwali 🔥#GameChanger takes charge in the theatres on JAN 10th ❤️🔥#GamechangerOnJAN10 🚁
— Sri Venkateswara Creations (@SVC_official) October 31, 2024
Global Star @AlwaysRamCharan@shankarshanmugh@advani_kiara@iam_SJSuryah@MusicThaman… pic.twitter.com/dbDr2HLWeQ
Also Read : ఫేస్ బుక్ లో మెసేజ్, మూడు వారాల్లోనే పెళ్లి.. దుల్కర్ లవ్ స్టోరీ తెలిస్తే షాక్
పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, ఎస్ జే సూర్య, సునీల్, నవీన్ చంద్ర, సముద్ర ఖని, జయరాం తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : మీనాక్షి చౌదరి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా?