Game Changer: మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో 'గేమ్ ఛేంజర్' సందడి మొదలు కాబోతుంది. రామ్ చరణ్, తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సినిమా నుంచి మరో సాంగ్ విడుదల చేశారు. Also Read: Sneha Reddy: అరెస్ట్ తర్వాత బన్నీ భార్య తొలి పోస్ట్ వైరల్.. అందులో ఏముందంటే? కొండ దేవర లిరికల్ సాంగ్ 'కొండ దేవర' లిరికల్ ఆడియోను షేర్ చేశారు. 'నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతర' అంటూ సాగిన పవర్ ఫుల్ లిరిక్స్, పాటలో రామ్ చరణ్ గెటప్ ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. తమన్, శ్రావణ భార్గవి ఆలపించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన రా మచ్చా, డోప్ సాంగ్, నానా హైరానా సాంగ్స్ సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ తో ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో 'నానా హైరానా' ' ఇన్ఫ్రారెడ్ కెమెరాతో తీసిన తొలి ఇండియన్ సాంగ్ కావడం విశేషం. అయితే ఈ సినిమాలో కేవలం పాటలు కోసమే రూ. 75 కోట్లు ఖర్చు చేసినట్లు నిర్మాత దిల్ రాజ్ తెలిపారు. #KondaDevara will swell you up with a strong fire within!🔗 https://t.co/b11WaDESsZA @MusicThaman Musical 🎶🎙️ #SravanaBhargavi✍️ @LyricsShyam#GameChanger#GameChangerOnJAN10 🚁Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah… pic.twitter.com/JJ4pYCUHkX — Thyview (@Thyview) January 7, 2025 RRR తర్వాత దాదాపు మూడేళ్ళ గ్యాప్ తో రామ్ చరణ్ సోలోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ త్రీ డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఎస్. జే సూర్య, శ్రీకాంత్, అంజలి, కియారా అద్వానీ, సముద్రఖని, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. Also Read: Game Changer: డాకు మహారాజ్ కు ఏపీ హైకోర్టు బిగ్ షాక్.. టికెట్ ధరల పెంపుకు బ్రేక్!