Actress Rakul Preet Singh
'నెపోటిజం'.. ఈ పదం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే దీని గురించి చాలామంది నటీనటులు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమ టాలెంట్ తో ఇండస్ట్రీకి వచ్చిన నటీ, నటులు నెపోటీజాన్ని ఎదుర్కుంటూ ఉంటారు. తాజాగా మన టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా నెపోటిజం బాధితురాలేనట.
ఈ విషయాన్ని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ మేరకు రకుల్ మాట్లాడుతూ.." 'చిత్రపరిశ్రమలో నెపోటిజం ఉంది. ఇదీ జరుగుతూనే ఉంటుందనేది కూడా వాస్తవం. ఈ కారణంతో నేను కొన్ని సినిమా ఛాన్సులను కోల్పోయాను. అరే, అవకాశాలు కోల్పోయానే అనే బాధ నాలో ఉండదు. అలా అని నేను కూర్చుని ఉండిపోయే వ్యక్తిని కాదు. బహుశా ఆ సినిమాలు నా కోసం ఉద్దేశించినవి కాకపోవచ్చని ముందుకు వెళ్తాను.
Also Read : అప్పటి వరకు నా సినిమాలను డబ్ చేయొద్దు : మహేష్ బాబు
నా తండ్రి సైన్యంలో పనిచేయడంతో ఆయన నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. దీంతో ఇలాంటి చిన్నవాటి గురించి నేను పెద్దగా ఆలోచించను. అవకాశాలు కోల్పవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంటుంది. అలాంటప్పుడు దక్కని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఉన్న సమయాన్ని వృథా చేసుకోను. ఒక స్టార్ కిడ్‌కు సులభంగా ఛాన్సులు వచ్చినట్లు కొత్తవారికి మాత్రం ఎట్టిపరిస్థితిల్లోనూ రావు.
ఆ క్రెడిట్ అంతా వారి తల్లిదండ్రులకు మాత్రమే చెందుతుంది" అని చెప్పుకొచ్చారు. కాగా 2021 లో 'కొండపొలం' సినిమాతో తెలుగు ఆడియన్స్ ను అలరించిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' లో కనిపించారు. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం అజయ్‌దేవగణ్ జంటగా రకుల్‌ప్రీత్ సింగ్ ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తున్నారు. విజయవంతమైన ‘దే దే ప్యార్ దే’కి కొనసాగింపుగా అన్షుల్ శర్మ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో పాటూ 'మేరీ పట్నీ కా', 'భారతీయుడు-3' ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.