Rajinikanth Health Update: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అర్ధరాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరోకి ఏమైందో అని కంగారు పడ్డారు. అయితే నార్మల్ చెకప్‌లో భాగంగా గుండెకు చెకప్ చేయించుకున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఆపై ఆయన ఆరోగ్యం కూడా కాస్త కుదుటపడిందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
రజినీకాంత్‌కు పొత్తి కడుపులో నొప్పి రావడంతోనే హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే వైద్యులు ఆయకు ఆపరేషన్ పూర్తి చేశారని.. పొత్తి కడుపులో స్టెంట్ వేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక తమ అభిమాన హీరోకి కడుపునొప్పి కారణంగా ఆపరేషన్ చేయడంతో అభిమానులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
అదే సమయంలో రజినీకాంత్ భార్య లతా సైతం స్పందించారు. ప్రస్తుతానికి రజినీకాంత్ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతుందని.. ఎవరూ కంగారు పడకండని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆమె స్పందనతో తలైవా అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: సూపర్ స్టార్ హెల్త్ అప్డేట్.. రజనీకాంత్ కు స్టెంట్ వేసిన డాక్టర్స్
ఈ క్రమంలో తాజాగా చెన్నై అపోలో హాస్పిటల్ వైద్యులు రజినీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఆ బులెటిన్ ప్రకారం.. రజినీకాంత్ గుండెకు సంబంధిచిన ప్రధాన రక్తనాళంలో వాపు గుర్తించినట్లు తెలిపారు. దీంతో ట్రాన్స్‌కాథెటర్ విధానంలో చికిత్స చేసినట్లు పేర్కొన్నారు.
సీనియర్ కార్డియాలజిస్ట్ సాయి సతీష్ ఆధ్వర్యంలో రజినీకాంత్‌కు స్టెంట్ వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ఆయన్ని డిశ్చార్జ్ చేస్తామని అపోలో వైద్యులు తెలిపారు. దీంతో అఫీషియల్‌గా వైద్యుల నుంచి సమాచారం రావడంతో రజినీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
రజినీకాంత్ సినిమాలు:
రజినీకాంత్ ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ అంచనాలు పెంచేశాయి. దీంతో ఈ మూవీ రిలీజ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈ నెల అంటే అక్టోబర్ 10న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాతో పాటు రజినీకాంత్ కూలీ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పలు అప్డేట్‌లతో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా కోసం కూడా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.