Rajamouli: ప్రసాద్ మల్టీప్లెక్స్ లో రాజమౌళి కపుల్ సందడి.. వీడియో వైరల్!  'F1' చూసేందుకు

డైరెక్టర్ రాజమౌళి హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో సందడి చేశారు. హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ నటించిన కొత్త సినిమా 'F1: ది మూవీ' ని తన సతీమణి రామ రాజమౌళితో కలిసి వీక్షించారు.

New Update

Rajamouli:  డైరెక్టర్ రాజమౌళి హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో సందడి చేశారు. హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ నటించిన కొత్త సినిమా 'F1: ది మూవీ' ని తన సతీమణి రామ రాజమౌళితో కలిసి వీక్షించారు. సినిమా చూసిన అనంతరం రాజమౌళి దంపతులు థియేటర్ నుంచి బయటకు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను  ప్రసాద్స్ మల్టీప్లెక్స్ తన ఎక్స్ హ్యాండిల్ లో  షేర్ చేస్తూ, "లెజెండరీ ఎస్.ఎస్. రాజమౌళి #F1TheMovie థ్రిల్‌ను బిగ్ స్క్రీన్ పై  అనుభవించడానికి ప్రసాద్స్ PCX ని సందర్శించారు. ఆయన ప్రతి క్షణాన్ని ఆస్వాదించారు" అని క్యాప్షన్ ఇచ్చింది. ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాను థియేటర్లో చూసి ఎంజాయ్ చేశారు. 

'F1: ది మూవీ'

జులై 27న విడుదలైన 'F1: ది మూవీ' కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. హాలీవుడ్ చిత్రమైనప్పటికీ.. సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. జోసెఫ్ కొసిన్స్కి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్రాడ్ పిట్‌తో పాటు డామ్సన్ ఇడ్రిస్, కెర్రీ కాండన్, టోబియాస్ మెన్జీస్, జేవియర్ బర్డెమ్ వంటి ప్రముఖ నటులు నటించారు. అంతేకాదు, నిజ జీవిత F1 స్టార్లు లూయిస్ హామిల్టన్, చార్లెస్ లెక్లర్, కార్లోస్ సైన్జ్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఫార్ములా వన్ రేసింగ్ ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇదిలా ఉంటే  ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తన SSMB29 సినిమా చేస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్స్ లో బిజీగా ఉంది. హై యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్ వండర్ గా రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆన్లైన్లో లీకైన కొన్ని సన్నివేశాల్లో మహేబాబు లుక్, యాక్షన్  ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Also Read: Pragya Jaiswal: అబ్బా.. రెడ్ డ్రెస్ లో ప్రగ్య గ్లామర్ షో అదిరింది! ఫొటోలు చూశారా

Advertisment
Advertisment
తాజా కథనాలు