/rtv/media/media_files/2025/11/12/ssmb29-event-2025-11-12-16-15-24.jpg)
SSMB29 Event
SSMB29 Event: దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli), సూపర్‌స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కలిసి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘గ్లోబ్‌ట్రాట్టర్’ (SSMB29) ఇప్పుడు భారీ చర్చకు దారి తీస్తోంది. ఈసారి రాజమౌళి టీం సరికొత్త ప్రమోషన్ స్ట్రాటజీని ఎంచుకుంది. సాధారణంగా టీజర్ రిలీజ్ చేసి తర్వాత ట్రైలర్ చూపించే పద్ధతి బదులు, నేరుగా పూర్తి ట్రైలర్‌ను విడుదల చేయబోతోంది.
రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ (Globetrotter Trailer)
సినిమా ట్రైలర్‌ను నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక ఈవెంట్‌లో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం కోసం 100 అడుగుల పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. ఇది తెలుగు సినీ చరిత్రలో అత్యంత భారీ ట్రైలర్ లాంచ్ అని చెప్పుకోవచ్చు.
శ్రుతి హాసన్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్..
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన శ్రుతి హాసన్ పాడిన ఎనర్జిటిక్ సాంగ్ ఇటీవలే విడుదలైంది. ఆ పాట ఆన్‌లైన్‌లో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ పాటను శ్రుతి హాసన్ రామోజీ సిటీ ఈవెంట్‌లో లైవ్‌గా పాడనున్నట్లు సమాచారం.
జియో హాట్‌స్టార్ డిజిటల్ పార్టనర్... సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఇప్పటికే జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. సంస్థ అధికారికంగా నవంబర్ 15న జరిగే ఈవెంట్‌ను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్‌లలో భాగంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఇంటరాక్టివ్ సెషన్‌లు కూడా నిర్వహించారు.
ఆఫ్రికా అడవుల్లో అడ్వెంచర్ కథ... గ్లోబ్‌ట్రాట్టర్ సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కథ ఆఫ్రికా అడవుల నేపథ్యంతో సాగే యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత విభిన్నమైన పాత్రగా చెప్పొచ్చు.
జక్కన్న మాస్టర్ స్ట్రోక్
టీజర్ లేకుండానే నేరుగా ట్రైలర్‌తో(Globetrotter Trailer) సినిమా ట్రైలర్ ను చూపించబోతున్న రాజమౌళి టీం నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రయత్నం ప్రమోషన్ విధానంలో కొత్త దారి చూపించబోతోందని అభిమానులు అంటున్నారు.
‘గ్లోబ్‌ట్రాట్టర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నవంబర్ 15న జరుగుతుండడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్ ఎంత సెన్సేషన్ క్రీస్తే చేస్తుందో చూడాలి!
Follow Us