RajaSaab Cutout: డార్లింగ్ ప్రభాస్ మోస్ అవైటెడ్ 'రాజాసాబ్' టీజర్ ఈరోజు విడుదలవడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్స్ థియేటర్ వద్ద ప్రభాస్ 40 అడుగుల భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు. డప్పులు వాయిస్తూ, వీధుల్లో నృత్యం చేస్తూ, పోస్టర్లపై పాలు పోస్తూ, థియేటర్ ప్రాంగణాన్ని పండగా వాతావరణంగా మార్చేశారు అభిమానులు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నాయి.
STAR STAR REBEL STAR 🌟 #Prabhas#TheRajaSaab#TheRajaSaabTeaserpic.twitter.com/dcRXAElb1J
— The RajaSaab (@rajasaabmovie) June 16, 2025
Also Read:Kuberaa Trailer: 'కుబేరా' ట్రైలర్ లో ఇదే హైలైట్.. ధనుష్- నాగ్ కాంబో అదిరింది!
40 ఫీట్ కటౌట్
కటౌట్‌లో ప్రభాస్ ఎరుపు రంగు కారు పై స్టైలిష్ గా కూర్చొని ఉన్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాస్ పట్ల తమ ప్రేమను తెలియజేశారు. "వింటేజ్ ప్రభాస్ తిరిగి వచ్చారు.. లుక్స్ చాలా బాగున్నాయి'' అంటూ టీజర్ పై ప్రశంసలు కురిపించారు. గత ఆరు ఐదు సంవత్సరాలుగా ఇంటెన్స్ , యాక్షన్-ప్యాక్డ్ పాత్రల్లో కనిపించిన ప్రభాస్ ని ఇప్పుడో కొత్త జానర్ లో చూడడం రిఫ్రెషింగ్ గా ఉందని చెబుతున్నారు. మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజా సాబ్' రొమాన్స్, హారర్, కామెడీ కలయికతో రూపొందింది.
Every rebel after watching teaser🔥@SKNonline#Prabhas#TheRajaSaabpic.twitter.com/qPWC5UG9PT
— KUKATPALLY PRABHAS YUVASENA (@kukatpallyPY) June 16, 2025
ఇదిలా ఉంటే విడుదలైన క్షణాల్లోనే టీజర్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. మొత్తం 2 నిమిషాలు 2 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ ఔట్ అండ్ ఔట్ కామెడీ, వణుకుపుట్టించే విజువల్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ జోడీగా మాళవిక, నిధి అగర్వాల్ నటించారు.
Also Read:దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం