ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిన్న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రిలీజైన ఈ ట్రైలర్ నిమిషాల వ్యవధిలోనే మిలియన్స్ కొద్దీ వ్యూస్, లక్షల కొద్దీ లైక్స్ ను రాబడుతోంది. ఈ క్రమంలోనే 'పుష్ప 2' ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది.
వ్యూస్ పరంగా ఇప్పటి వరకు ఉన్న గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. తెలుగులో ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్లలో మహేశ్ 'గుంటూరు కారం' ట్రైలర్ 24 గంటల్లో ఎక్కుమంది చూశారు. ఈ ట్రైలర్‌కు 24 గంటల్లో 37.68 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
Ruling the record books 🔥🔥#Pushpa2TheRuleTrailer (Telugu) - FASTEST 40Million VIEWED TRAILER IN SOUTH INDIA ❤🔥❤🔥#RecordBreakingPushpa2TRAILER 🌋🌋
— Mythri Movie Makers (@MythriOfficial) November 18, 2024
▶️ https://t.co/O9iK3r5TkJ#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/l9GO82zH0w
Also Read : మెగా ఫ్యామిలీలో 'పుష్ప2' చిచ్చు.. ఏం జరిగిందంటే?
15 గంటల్లోనే 42 మిలియన్ వ్యూస్..
తర్వాత ప్లేస్‌లో ప్రభాస్ 'సలార్' 32.58 మిలియన్ వ్యూస్‌తో ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కేవలం 15 గంటల్లో అల్లు అర్జున్ 'పుష్ప2' ట్రైలర్ దాటేసింది. రిలీజైన 15-16 గంటల్లోనే ఏకంగా 42 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. దీంతో టాలీవుడ్ లో 24 గంటలు గడవకముందే అత్యధిక వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా 'పుష్ప2' న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది.
కాగా 24 గంటలు పూర్తయ్యేసరికి ట్రైలర్ 50 మిలియన్ల వ్యూస్ అందుకోవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుమారు 2:48 నిమిషాల నిడివితో ఉన్నఈ ట్రైలర్ ఫ్యాన్స్ తో పాటూ నార్మల్ ఆడియన్స్ ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.