/rtv/media/media_files/2024/11/18/sDp9wZrUHU1ALZnxtULi.jpg)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2' ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా ట్రైలర్ పైనే చర్చ నడుస్తోంది.
This time it isn't just FIRE, it is WILDFIRE 🔥🔥#Pushpa2TheRuleTrailer out now!
— Mythri Movie Makers (@MythriOfficial) November 17, 2024
Telugu ▶️ https://t.co/sSVDkz2eYx
Hindi ▶️ https://t.co/OedREaMXF0
GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 5TH 💥💥#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/xnQzof3XK5
ట్రైలర్ లో అల్లు అర్జున్ విజువల్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. ట్రైలర్ తో దేశవ్యాప్తంగా పుష్ప-2కు భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ ట్రైలర్ పై టాలీవుడ్ సెలెబ్రిటీలు రాజమౌళి, రాంగోపాల్‌వర్మ నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
WILDFIRE started in Patna!!
— rajamouli ss (@ssrajamouli) November 18, 2024
Spreading across the country!!
Explodes on Dec 5th!!!
CAN’T WAIT for the party PUSHPA!!!
Also Read : ప్రభాస్ 'రాజాసాబ్' లో ఆ హిట్ సాంగ్ రీమిక్స్..!?
మెగా ఫ్యామిలీ నో కామెంట్స్..
కానీ మెగా ఫ్యామిలీ హీరోలు మాత్రం ట్రైలర్ పై స్పందించి లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ అయిపోయారు. దీంతో మళ్ళీ మెగా vs అల్లు ఫైట్ తెరపైకొచ్చింది. కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
This one looks like it will go through the STRATOSPHERE .. @alluarjun is the MEGAOMEGATOWERPLANETORY STAR https://t.co/5OEjrAVQv5
— Ram Gopal Varma (@RGVzoomin) November 18, 2024
ఇటీవల ఏపీ ఎలక్షన్స్ టైం లో అల్లు అర్జున్.. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికెళ్లి మద్దతిచ్చినప్పటినుంచి మెగా హీరోలు అల్లు అర్జున్‌తో దూరందూరంగా ఉంటున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఇటీవల ఓ ఈవెంట్ లో మేమందరం ఒకటే అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు 'పుష్ప 2' ట్రైలర్‌పై స్పందించకపోవడంతో వీరి మధ్య ఇంకా విభేదాలు సమసిపోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read : ఆ స్టార్ హీరో వేధిస్తున్నాడు.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్