ఆ కుంటుంబానికి అండగా మేముంటాము.. మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్!

'పుష్ప2' సినిమా ప్రీమియర్ షో జరిగిన తొక్కిసలాటలో మరణించిన మహిళా కుటుంబానికి మైత్రి మూవీ మేకర్స్ అండగా నిలిచారు. ''ఈ క్లిష్టమైన సమయంలో వారికి అన్ని విధాలుగా సహాయపడేందుకు ముందుంటాము'' అని ట్వీట్ చేశారు.

New Update

Pushpa 2:  అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఓ కుటుంబంలో విషాదం నింపింది. నిన్న రాత్రి  RTC క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చారు. దీంతో థియేటర్ ముందు తొక్కిలసట జరిగింది. తొక్కిసలాటలో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. పోలీసులు వారిని గమనించి సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేవతి కన్నుమూసింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. 

Also Read: ఒకరేమో సూపర్ హిట్ అంటున్నారు.. మరొకరేమో అట్టర్‌ ఫ్లాప్‌..ట్విట్టర్ లో 'పుష్ప' రచ్చ

కుటుంబానికి అండగా మేముంటాము.. 

అయితే ఈ ఘటనపై పుష్ప నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ స్పందించారు. బాధితులకు అండగా ఉంటామని ట్వీట్ చేశారు. గత రాత్రి పుష్ప ప్రీమియర్ స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాదం సంఘటనకు ఎంతో భాదపడ్డాము. ఆ కుటుంబానికి, అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న పిల్లవాడికి మా ప్రార్థనలు ఉంటాయి. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవడానికి సాధ్యమైనంత సహాయాన్ని అందించడానికి అందించడానికి సిద్ధంగా ఉన్నాయి అంటూ పోస్ట్ పెట్టారు. 

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! 

Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు