Pushpa 2 : కిస్సిక్ సాంగ్.. ఇలా ఎక్కేస్తుందేంటి మావా!

సోషల్ మీడియాలో, బయట ఎక్కడ విన్నా 'కిస్సిక్' పాటే వినిపిస్తోంది. ఫోన్, టీవీల నుంచి మొదలుకొని ఆటోలు, బస్సుల్లోనూ ఇదే పాట వినిపిస్తోంది. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరూ ఈ సాంగ్ వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

New Update


ప్రస్తుతం సోషల్ మీడియాలోచూసినా, బయట ఎక్కడ చూసినా 'పుష్ప2' మేనియానే నడుస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన 'కిస్సిక్' సాంగ్ తో వైబ్ అవుతున్నారు. ఎక్కడ విన్నా ఇదే పాట మారుమోగిపోతోంది. ఫోన్, టీవీల నుంచి మొదలుకొని ఆటోలు, బస్సుల్లోనూ ఇదే పాట వినిపిస్తోంది. 

చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరూ ఈ సాంగ్ వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి ఈ పాట రిలీజ్ అయినప్పుడు ఎవ్వరికీ అంతగా నచ్చలేదు. ఫ్యాన్స్ కూడా ఊహించనంతగా ఏం లేదని కామెంట్స్ చేశారు. కానీ రిపీట్ మోడ్ లో వింటుంటే అలా ఎక్కేసింది. 

Also Read  : బాబోయ్.. 'పుష్ప2' టికెట్ రేట్ 3 వేలా?

మ్యూజిక్ డైరెక్టుగా మణిశర్మ ఓ సందర్భంలో.. ఏ పాట ఎప్పుడు ఎలా నచ్చుతుందో ఎవ్వరం చెప్పాలేం. కొన్ని పాటలు ఒక్కసారి వినగానే నచ్చుతాయి, కొన్ని పాటలు వింటూ వింటూ మన మైండ్ లోకి ఆటోమేటిక్ గా ఎక్కేస్తాయి..' అన్నట్లు ఈ కిస్సిక్ సాంగ్ కూడా అంతే.. వింటూ వింటూ మైండ్లోకి ఎక్కేసింది. 

సోషల్ మీడియా ట్రెండింగ్ లో..

ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఈ సాంగ్ గురించే డిస్కషన్ అంతా. రీసెంట్ అడిక్టెడ్ సాంగ్ అని, కిస్సిక్ తో వవైబ్ అవుతున్నా అని, కిస్సిక్ ఇలా ఎక్కేస్తుందేంటి మావా, ఈ సాంగ్ మైండ్ లో నుంచి వెళ్ళట్లేదు అంటూ..' నెటిజన్స్ అంతా కిస్సిక్ సాంగ్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ సాంగ్ కాస్త సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచింది. ఇక యూట్యూబ్ లో ఈ పాట 40 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.

Also Read : రెమ్యునరేషన్ లోనూ తగ్గేదేలే..'పుష్ప2' కి బన్నీ అన్ని కోట్లు తీసుకున్నాడా?

#pushpa2 #kissik
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe