pushpa 2
Pushpa 2: అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2'. పాన్ ఇండియా హిట్టుగా నిలిచిన 'పుష్ప' సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ తో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: బాలీవుడ్ లో రష్మిక హవా.. మరో ప్రాజెక్ట్ ఒకే చేసిన బ్యూటీ.. కొత్తగా టైటిల్
మరో కొత్త పోస్టర్
ఈ నేపథ్యంలో నేడు దీపావళి సందర్భంగా మూవీ నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీవల్లి, పుష్ప రాజ్ రొమాంటిక్ పోస్టర్ ను షేర్ చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. పార్ట్ 1లో శ్రీవల్లి, పుష్ప రాజ్ పెళ్లి అవుతుంది. ఇక పెళ్లి తర్వాత వారి జీవితంలో ఏం జరిగింది? పుష్ప రాజ్ జర్నీ ఎలాంటి మలుపు తిరిగింది అనే అంశాలు పార్ట్ 2లో ఉండబోతున్నాయి.
Also Read: బిగ్ సెల్యూట్.. 'అమరన్' మూవీ పై CM ప్రశంసలు!
1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్
రిలీజ్ కు ముందే పుష్ప2 రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి RRR 10200 స్క్రీన్స్ లో విడుదలైంది. దీంతో 'పుష్ప 2' ఈ రికార్డును బ్రేక్ చేయనుంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ కానుంది.
Pushpa Raj & Srivalli wish you and your family a very Happy Diwali 🫶
— Rashmika Mandanna (@iamRashmika) October 31, 2024
GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER, 2024 ❤🔥#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @AAFilmsIndia… pic.twitter.com/fJ0pmQxk4j
Also Read: జిల్ జిల్ జిగేల్.. టాలీవుడ్ స్టార్లు దీపావళి విషెస్ ఎలా చెప్పారో చూడండి!