/rtv/media/media_files/2025/09/27/puri-sethupathi-2025-09-27-18-29-34.jpg)
Puri Sethupathi
Puri Sethupathi: టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమాను విజయ్ సేతుపతితో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై సినీ వర్గాల్లో ఇప్పటికే మంచి హైప్ ఉంది. అయితే, పూరి గతంలో వరుసగా ప్లాప్‌లు ఎదుర్కొన్న నేపథ్యంలో, ఈ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో అన్నదే ఆసక్తికరంగా మారింది.
Get ready for the Grand Launch Event of #PuriSethupathi Title & Teaser tomorrow, 28th September 💥
— Kollywood Cinima (@KollywoodCinima) September 27, 2025
From 1 PM onwards at Hotel GreenPark, Chennai ❤️🔥
A #PuriJagannadh film 🎬@Charmmeofficial Presents 🎥#JBNarayanRaoKondrolla#HBDPuriJagannadh#25YearsOfPuriJagannadhpic.twitter.com/dlEDfM2Ov1
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
పక్కా మాస్ ట్రీట్..
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు "స్లమ్‌డాగ్" అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అధికారికంగా టైటిల్ రివీల్, టీజర్ విడుదలను రేపు జరపనున్నారు. టైటిల్ చూస్తే ఇది ఓ మాస్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని అర్థమవుతోంది. పూరి స్టైల్‌కు తగ్గట్టుగా పక్కా మాస్ ట్రీట్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
ఈ చిత్రంలో టబు, సమ్యూక్తా, దునియా విజయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కథలో వారికి కీలకమైన స్కోప్ ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను పూరి కనెక్ట్స్, JB మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చార్మీ కౌర్, పూరి జగన్నాథ్, JB నారాయణ రావు కొండ్రొళ్ల కలిసి నిర్మిస్తున్నారు.
Also Read:‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
ఈ సినిమాకు సంగీతాన్ని మహతి స్వర సాగర్ అందిస్తున్నారు. ఆయనకు ఇది పూరితో కలిసి చేస్తున్న తొలి సినిమా కావడం విశేషం. ఇప్పటికే బీభత్సమైన మాస్ సౌండ్‌ట్రాక్‌లతో మహతికి మంచి ఫేమ్ ఉంది.
ఇక పూరి - విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా టైటిల్‌పై క్లారిటీ రావాలంటే రేపు అధికారిక ప్రకటనతో తేలనుంది. టీజర్ ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. పూరి మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..