హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గుండె సమస్యలతో ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సోదరుడు అయిన రామ్మూర్తి నాయుడు హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటి లేటర్‌పై చికిత్స పొందుతూ మరణించారు.
Also Read: ఇంకా రాజధానిగా ఢిల్లీ అవసరమా..?
ఆయన మృతిపై ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపగా.. తాజాగా భారత ప్రధాని రేంద్ర మోదీ సైతం నారా రోహిత్ కు లేఖ రాస్తూ రామ్మూర్తి నాయుడి మృతికి సంతాపం తెలిపారు. రామ్మూర్తి అందరినీ విడిచి వెళ్లినా, కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ విషాదం నుంచి రోహిత్ త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా నిలబడాలని లేఖలో పేర్కొన్నారు. ఇందుకు ప్రధాని మోదీకి నారా రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : RGV విచారణలో బిగ్ ట్విస్ట్..?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా..
రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు నటుడు నారా రోహిత్ కాగా, మరొకరు గిరీష్.