Dragon OTT: "డ్రాగన్" ఓటీటీ స్ట్రీమింగ్‌.. ఎప్పటినుంచంటే?

ప్రముఖ OTT ప్లాట్ ఫారం నెట్‌ఫ్లిక్స్ డ్రాగన్ మూవీ హక్కులను పొందింది. మార్చి 21 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని సమాచారం. అయితే, డ్రాగన్ మూవీ రూ. 35 కోట్లతో నిర్మించగా, బాక్సాఫీస్‌ వద్ద రూ. 150కోట్లు కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

New Update
Dragon OTT

Dragon OTT

Dragon OTT: "లవ్ టుడే" సినిమాతో తెలుగు, తమిళ ఆడియన్స్ కు బాగా దగ్గరైన ప్రదీప్‌ రంగనాథన్ తాజాగా నటించిన "రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్" చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.  ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది.. అయితే ప్రముఖ OTT ప్లాట్ ఫారం నెట్‌ఫ్లిక్స్ డ్రాగన్ మూవీ హక్కులను పొందినట్లు సమాచారం, త్వరలో అధికార ప్రకటన రానుంది.

ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదల అయింది. యూత్ ఆడియన్స్ టార్గెట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ యువతను ఎంతగానో ఆకట్టుకుంది.. హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌ నటించారు.

Also Read:Kartik Aaryan: కార్తిక్‌ ఆర్యన్‌, శ్రీలీల డేటింగ్‌.. కన్ఫామ్ చేసిన హీరో తల్లి?

మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో

అయితే, "రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్" హిందీలో మార్చి 14న విడుదల కానుంది. ఈ మూవీ ఓటీటీకి సంబంధించి ఒక పోస్టర్‌ సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని సమాచారం.

డ్రాగన్ మూవీని రూ. 35 కోట్లతో నిర్మించగా, బాక్సాఫీస్‌ వద్ద రూ. 150కోట్లు కలెక్షన్లు రాబట్టి  సూపర్ హిట్ గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా 
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అన్నింటిలో సూపర్ సక్సెస్ గా దూసుకెళ్తోంది. 

Also Read: రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో బిగ్ ట్విస్ట్ .. ప్రోటోకాల్‌ దుర్వినియోగం వెనుక సవితి తండ్రి

Advertisment
తాజా కథనాలు