/rtv/media/media_files/2025/10/11/pradeep-ranganathan-dude-2025-10-11-13-07-53.jpg)
Pradeep Ranganathan Dude
Pradeep Ranganathan Dude: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన తాజా తమిళ చిత్రం “డూడ్” వచ్చే అక్టోబర్ 17, 2025 న థియేటర్లలో విడుదలకానుంది. కొత్త దర్శకుడు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదలై, మంచి కామెడీ, ఎమోషన్స్ ఉన్న చిత్రంగా ప్రేక్షకుల మనసు దోచింది. ఈ సందర్భంగా ప్రదీప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ సినిమా ఎలా ఉండబోతుందో, ఇది ఏ విషయాన్ని ప్రాధాన్యంగా చూపించబోతోందో చెప్పారు.
Also Read: కెరీర్ మీద ఫోకస్ పెట్టిన పికిల్స్ పాప.. బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ?
'లవ్ టుడే' కంటే ఎమోషన్స్ ఎక్కువ
ప్రదీప్ మాట్లాడుతూ, "డూడ్ సినిమా సుమారు 70% వరకూ లవ్ టుడే లా ఉంటుంది. కామెడీ ఇందులో కూడా ఉంటుంది. కానీ, డూడ్ లో ఎమోషన్ మరింత ఎక్కువగా ఉంటుంది. 'లవ్ టుడే'లో లాస్ట్ సీన్స్ మాత్రమే సీరియస్‌గా ఉండేవి. కానీ డూడ్ లో 20వ నిమిషం నుంచి ఎమోషనల్ జర్నీ మొదలవుతుంది" అని తెలిపారు.
Also Read: హాట్ అండ్ క్యూట్ లుక్స్‌లో మెహ్రీన్..
ఈ సినిమా యువతను మాత్రమే కాకుండా, కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా రూపొందించబడిందని చెప్పారు. ఇంటి లోని అసహనకరమైన బంధాలను చూపించబోతున్నారు. ఈ సినిమా ముఖ్యంగా ఒక సామాజిక సమస్యను చూపించబోతోంది. మన సమాజంలో ఇంకా చాలా మంది మహిళలు తమకు అన్యాయంగా, హింసాత్మకంగా వ్యవహరించినా, వివాహ బంధం కోసం దానిని సహించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రదీప్ ఇలా చెప్పారు:
"ఇప్పటికి కొన్ని ఇళ్లల్లో మహిళలు, శారీరకంగా హింసకు గురయ్యే బంధంలో కూడా, తాము పెళ్లి చేసుకున్నాం కాబట్టి సహించాల్సిందేనని అనుకుంటున్నారు. కానీ నా అభిప్రాయం ప్రకారం, వ్యక్తి ముఖ్యమా లేక పెళ్లి అనేది ముఖ్యమా అన్నది తేల్చుకోవాలి. బాధను భరించాల్సిన అవసరం లేదు."
Also Read: వైరల్ అవుతోన్న 'OG' హీరోయిన్ ప్రియాంక మోహన్ AI ఫోటోలు..
ఈ సందేశాన్ని ప్రేక్షకులకు కామెడీతో పాటు, సీరియస్ గా చెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ కథను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
తన అభిమానులను నిరాశపరచనని అంటున్న ప్రదీప్.. లవ్ టుడే, డ్రాగన్ వంటి చిత్రాలతో పొందిన ప్రేక్షకుల ఆదరణను ఈ సినిమాతో కొనసాగించాలని ప్రదీప్ భావిస్తున్నారు.
Also Read: విజయ్ దేవరకొండ - కీర్తి సురేష్ జోడీ కన్‌ఫర్మ్.. పూజా కార్యక్రమం త్వరలో!
డూడ్ సినిమా కేవలం ఓ యూత్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, ఇంట్లో జరిగే హింసాత్మక సంబంధాలపై మాట్లాడే కుటుంబ కథా చిత్రం కూడా. నవ్వులు పంచుతూనే, సీరియస్ సందేశాన్ని అందించబోతున్న ఈ సినిమాపై ఇప్పటినుంచే ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 17న డూడ్ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow Us