టాలీవుడ్ లో ఒకప్పుడు యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'ఆది' సినిమాతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయిన ఈయన.. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత చెన్నకేశవ రెడ్డి, దిల్, లక్ష్మి, ఠాగూర్, అదుర్స్, కృష్ణ, నాయక్, అల్లుడు శీను సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
చిరంజీవి, బాలకృష్ణలాంటి అగ్ర కథానాయకుల నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్లాంటి యంగ్ హీరోలతోనూ పని చేశాడు. అయితే గత కొన్నాళ్లుగా వినాయక్ డైరెక్షన్ కు దూరంగా ఉంటున్నారు. చివరగా ఆయన ప్రభాస్ 'ఛత్రపతి' సినిమాలు హిందీలో తీశారు. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. ఇక ఆ మధ్య హీరోగా 'సీనయ్య' అనే సినిమా కూడా చేశాడు. కారణమేంటో తెలియదుగానీ అది కార్యరూపం దాల్చలేదు.
లాంగ్ గ్యాప్ తర్వాత డార్లింగ్ తో..
అయితే రీసెంట్ గా ఆయన ఆరోగ్యం బాలేదనే వార్తలు వచ్చాయి. ఆయనకు ఒక మేజర్ లివర్ సర్జరీ జరిగిందని కూడా చెప్పారు. నేడు ఆయన బర్త్ డే కావడంతో పాన్ ఇండియా హీరో ప్రభాస్.. ఆయన్ను స్వయంగా కలిసి విషెస్ తెలిపారు. అందుకు సంబంధించిన ఓ పిక్ బయటికొచ్చింది.
Also Read : సురేఖ అసలు ఆ మాటే అనలేదు.. వైరల్ అవుతోన్న లాయర్ వీడియో!
అందులో ప్రభాస్ - వినాయక్ ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వినాయక్ ను చూసి కొందరు నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఆయన ఇలా మారిపోయాడేంటని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ - వినాయక్ మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన 'యోగి' ఫ్యాన్స్ నిరాశ పరిచింది. దాంతో వినాయక్.. ప్రభాస్ తో ఇంకో సినిమా చేసి ఎలాగైనా హిట్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఎందుకనో అది కుదరలేదు.
మెగా హీరోలు కూడా..
ప్రభాస్ తో పాటూ మెగా హీరోలైన చిరంజీవి, రామ్ చరణ్ సైతం వినాయక్ బర్త్ డే సందర్భంగా ఆయన్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు సంబంధించి ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.