RajaSaab OTT: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ OTT డీల్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఇదే..!

ప్రభాస్ రొమాంటిక్ హారర్ కామెడీ 'ది రాజా సాబ్' 2026 జనవరి 9న సంక్రాంతికి రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్‌కు ఒక నెల ముందు జియో హాట్‌స్టార్ OTT హక్కులు పొందినట్లు వార్తలు వస్తున్నాయి. మళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

New Update
RajaSaab OTT

RajaSaab OTT

RajaSaab OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న కొత్త సినిమా ద రాజా సాబ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన అప్‌డేట్లు అభిమానుల్లో మంచి ఆసక్తిని పెంచాయి.

ఈ చిత్రం సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. త్వరలోనే రెండో సింగిల్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ OTT డీల్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఇదే..!

తాజా సమాచారం ఏమిటంటే… సినిమా రిలీజ్‌కు ఒక నెల ముందు ది రాజా సాబ్ ఓటీటీ ఒప్పందం పూర్తయిందట. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. కానీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన మలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం అందిస్తున్న తమన్ ఇప్పటికే విడుదలైన టీజర్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Also Read: 'అఖండ 2'కు దెబ్బ మీద దెబ్బ.. టెన్షన్ పెడుతోన్న కొత్త రిలీజ్ డేట్!

సినిమా చుట్టూ ఉన్న హైప్, ప్రభాస్ మార్కెట్, మారుతి కమర్షియల్ టచ్ ఇలా అన్ని కలిపి ఈ చిత్రాన్ని భారీగా నిలిపాయి. కథ, కామెడీ, హారర్ కలయిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని మూవీ టీమ్ నమ్మకం.

ఓటీటీ హక్కుల వార్త బయటకు రావడంతో అభిమానులు కూడా సంబరపడుతున్నారు. పెద్ద సినిమాలు థియేటర్ల తరువాత ఏ ప్లాట్‌ఫారంపై వస్తాయి అనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి, ది రాజా సాబ్ డిజిటల్ రిలీజింగ్‌కి సంబంధించిన ఈ అప్‌డేట్ అందరి దృష్టిని ఆకర్షించింది. త్వరలో మూవీ టీమ్ అధికారికంగా స్ట్రీమింగ్ పార్ట్నర్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు