Akhanda 2 Update: 'అఖండ 2'కు దెబ్బ మీద దెబ్బ.. టెన్షన్ పెడుతోన్న కొత్త రిలీజ్ డేట్!

'అఖండ 2' వాయిదా పడడంతో బాలయ్య అభిమానుల్లో నిరాశ పెరిగింది. ఆర్థిక సమస్యలు, పాత బకాయిల కారణంగా విడుదల ఆగిపోయిందని తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ క్షమాపణలు చెబుతూ త్వరలో కొత్త తేదీ చెబుతామని ప్రకటించింది. డిసెంబర్ లేదా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

New Update
Akhanda 2 Update

Akhanda 2 Update

Akhanda 2 Update: బాలకృష్ణ(Balakrishna) ప్రధాన పాత్రలో వస్తున్న అఖండ 2 విడుదలపై పెద్ద గందరగోళం నెలకొంది. కొన్ని రోజులు నుంచి ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత రాకపోవడంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థకు ఉన్న పాత బకాయిల కారణంగా సినిమా అర్ధాంతరంగా వాయిదా పడిందనే సమాచారం బయటకు రావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ కూడా స్టార్ట్ అయిన తర్వాత హఠాత్తుగా వచ్చిన ఈ వాయిదా నిర్ణయం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో స్పందించిన బాలయ్య అభిమానులు “ఒక పెద్ద సినిమా కోసం ముందుగానే ప్లాన్ చేయాలి, ఇలా చివరి క్షణంలో ఎలా మార్చేస్తారు?” అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రతికూల పరిస్థితుల్లో 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ఒక నోట్ విడుదల చేసి అభిమానులకు క్షమాపణలు చెప్పింది. తమ ప్రయత్నం చేసినప్పటికీ ఊహించని పరిస్థితుల వల్ల సినిమా వాయిదా పడిందని చెప్పింది. అలాగే, బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సమయంలో తమకు అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది.

ఈ ప్రకటన వచ్చిన తరువాత అభిమానుల్లో కొత్త సందేహం మొదలైంది. అసలు సినిమా త్వరలోనే వస్తుందా? లేక మరింత వాయిదా అవుతుందా? అని చర్చ మొదలైంది. కొంతమంది సోషల్ మీడియా వేదికల్లో బుక్ మై షోలో సినిమా విడుదల తేదీ 2026గా కనిపిస్తోందని చెబుతుండగా, మరికొందరు మాత్రం ఈ ఏడాది డిసెంబర్ 12 లేదా 25 తేదీల్లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ తేదీలు తప్పితే సంక్రాంతి బరిలో అఖండ 2కి అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే, పండుగ సమయంలో పెద్ద పోటీ ఉండే అవకాశం ఉండటం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడుతుందనే ఆందోళనను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే క్రిస్మస్ సీజన్‌లో విడుదల చేస్తే సినిమాకు ఇంకా మంచి లాభం ఉంటుందని సూచనలు వస్తున్నాయి.

ఇంకా ఒక వైపు బాలయ్య ఈ వాయిదా విషయంలో ఎంతో సీరియస్‌గా ఉన్నారని సమాచారం. ఇక నిర్మాత సురేష్ బాబు మాటల ప్రకారం, సినిమా ఆర్థిక సమస్యలపై పరిశ్రమలోని పెద్దల మధ్య చర్చలు జరిగాయి. కానీ సాయంత్రం విడుదలపై వచ్చిన ఆశలు మేకర్స్ ప్రకటనతో తగ్గిపోయాయి.

ఈ పరిస్థితుల్లో అఖండ 2 మరోసారి వాయిదా పడినట్టే కనిపిస్తోంది. కొత్త విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు? సంక్రాంతికే దింపుతారా? అన్నది చూడాల్సిందే.

Advertisment
తాజా కథనాలు