/rtv/media/media_files/2025/10/16/prabhas-birthday-2025-10-16-16-36-41.jpg)
Raja Saab
Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ది రాజాసాబ్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా కనిపించగా, మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
Raja Saab Trailer
ఇటీవల విడుదలైన ‘రాజాసాబ్’ ట్రైలర్ ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభాస్ కామెడీ టైమింగ్, హారర్ టచ్, రొమాంటిక్ సీన్స్ ఫ్యాన్స్‌కి కొత్త అనుభూతి ఇచ్చాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ లైట్ హార్ట్ రోల్‌లో కనిపించడం అభిమానులను ఆనందపరిచింది.
తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ మీడియా సమావేశంలో ఫస్ట్ సింగిల్ నవంబర్ 5న విడుదల కానుందని ప్రకటించారు. ఈ పాటతో సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ‘రాజాసాబ్’ సినిమాను రెండు భాగాలుగా(Raja Saab Part 2) తీసుకురావాలని టీమ్ నిర్ణయించింది. కథా చర్చలు పూర్తయ్యాయి, దర్శకుడు మారుతి ప్రభాస్‌కి రెండో పార్ట్ ఐడియా చెప్పగా ఆయన కూడా వెంటనే ఓకే చెప్పారట. మొదటి భాగం జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది, చివర్లో సెకండ్ పార్ట్‌కు హింట్ ఇస్తారని టాక్.
ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయి.
‘రాజాసాబ్’ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఒక పాత్రలో కామెడీ టచ్ ఉంటే, మరో పాత్రలో యాక్షన్, సీరియస్ షేడ్ ఉంటుందని టీజర్ చేసుట తెలుస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’ (సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం), ‘ఫౌజీ’, ‘కల్కి 2’, ‘సలార్ 2’ వంటి పెద్ద ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. అయినా కూడా, ‘రాజాసాబ్’ రెండో భాగం కూడా త్వరలోనే మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది.
హారర్, కామెడీ, లవ్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ అన్నీ సీరియస్ యాక్షన్ మూవీస్‌లోనే నటించాడు. ఇప్పుడు మళ్లీ తనలోని ఫన్ సైడ్‌ని చూపించడానికి ‘రాజాసాబ్’గా మారుతున్నాడు. మొత్తానికి, జనవరి 9న ‘రాజాసాబ్’తో ప్రభాస్ కి హిట్టు ఖాయంగా కనిపిస్తోంది, ఫ్యాన్స్‌కి డబుల్ ఫెస్ట్ రెడీ అనమాట!!
Follow Us