Raja Saab: డార్లింగ్ ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్.. ఏకంగా 6,000+ CG షాట్స్!

ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో రాజా సాబ్ ఒకటి. మారుతీ దర్శకత్వంలో  రొమాంటిక్ కామెడీ హారర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై రోజు రోజుకు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇ

New Update
raja saab

raja saab

Raja Saab: ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో రాజా సాబ్ ఒకటి. మారుతీ దర్శకత్వంలో  రొమాంటిక్ కామెడీ హారర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై రోజు రోజుకు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మొదటి ట్రైలర్ విడుదల చేయగా  సంచలనం సృష్టించింది. ఇందులో ప్రభాస్ కామెడీ, స్టైల్, మేకోవర్ సినిమాకు మరింత హైప్ పెంచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. 

6,000 CG షాట్స్ .. 

ఈ సినిమాలో 6000 కంటే ఎక్కువ CG  (కంప్యూటర్ గ్రాఫిక్స్)  షాట్స్ ఉన్నాయట. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ ఇన్ హౌజ్ VFX కంపెనీతో పాటు మరికొన్ని ప్రముఖ స్టూడియోలతో కలిసి  సమయానికి  VFX పనులు పూర్తి  చేయడానికి శ్రమిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం.. ప్రస్తుతం రోజుకు 200 నుంచి 300 అందించే పనుల్లో ఉన్నాయట టీమ్స్. ఇదొక ఫాంటసీ  హారర్ నేపథ్యంతో కూడిన చిత్రం కావడంతో CG  షాట్స్  కీలకంగా ఉంటాయి. దీంతో డైరెక్టర్ మారుతి ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతుని అందించేందుకు.. దగ్గరుండి మరీ CG  పనులను పర్యవేక్షిస్తున్నారట.  VFX పనులను త్వరగా పూర్తి చేసి అనుకున్న టైంకి మూవీని  విడుదల చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు టీమ్.  'రాజా సాబ్' వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. 

Also Read: OTT MOVIES: ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. ఈ మూడు అస్సలు మిస్సవ్వదు!

Advertisment
తాజా కథనాలు