OTT MOVIES: ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. ఈ మూడు అస్సలు మిస్సవ్వదు!

ఓటీటీలు వచ్చాక ఎంటర్ టైన్మెంట్ కి అసలు కొదవేలేదు. ప్రేక్షకులను అలరించేందుకు ప్రతి వారం కొత్త కంటెంట్ తో సిద్దమవుతాయి. ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు బోలెడు సినిమాలు, సీరీస్ లు, షోలు ఓటీటీలోకి వచ్చేశాయి.

New Update
this week ott

this week ott

OTT MOVIES: ఓటీటీలు వచ్చాక ఎంటర్ టైన్మెంట్ కి అసలు కొదవేలేదు. ప్రేక్షకులను అలరించేందుకు ప్రతి వారం కొత్త కంటెంట్ తో సిద్దమవుతాయి. ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు బోలెడు సినిమాలు, సీరీస్ లు, షోలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఈ వారం స్ట్రీమింగ్ సినిమాల లిస్ట్ ఏంటో ఇక్కడ చూసేయండి.  

ఓటీటీ సినిమాలు 

కొత్త లోక

డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ  ‘లోక: ఛాప్టర్ 1 - చంద్ర’ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 31 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠి భాషల్లో అందుబాటులో ఉంది. సూపర్ హీరో తరహా చిత్రంగా రూపొందిన ఈ మూవీలో కళ్యాణి సూపర్ హీరో పాత్రలో నటించింది. 

ఇడ్లీ కొట్టు 

ధనుష్- నిత్యా మీనన్ జంటగా నటించిన 'ఇడ్లీకొట్టు'  ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. గత నెల దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ధనుష్ మాత్రం ఎప్పటిలానే తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించారు. 

కాంతారా చాప్టర్- 1 

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో  నటించిన  'కాంతారా చాప్టర్- 1' అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 

నెట్‌ఫ్లిక్స్‌

  • బల్లాడ్‌ ఆఫ్‌ ఏ స్మాల్‌ ప్లేయర్‌
  • ది అస్సెట్‌ 
  • అలీన్‌ 

జియో హాట్ స్టార్ 

  • భాయ్‌ తుజైపాయి; అక్టోబరు 31
  • మారిగల్లు:  అక్టోబరు 31
  • రంగ్‌బాజ్‌: ది బిహార్‌ చాప్టర్‌:  అక్టోబరు 31

అమెజాన్‌ ప్రైమ్‌

  • హెజ్బిన్‌ హోటల్‌ (వెబ్‌సిరీస్‌)
  • హెడ్డా

Also Read: Bigg Boss 9: ఏరా భట్టు ప్రేమ కావాలా.. దివ్వెల మాధురి- భరణి స్కిట్ అదిరింది! నవ్వులే నవ్వులు

Advertisment
తాజా కథనాలు