Raja Saab Runtime: 'రాజాసాబ్' ప్లాన్ చేంజ్.. కొత్త రన్ టైమ్ ఎంతంటే..?

ప్రభాస్ హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజా సాబ్’ జనవరి 9న విడుదల కానుంది. ఫైనల్ రన్‌టైమ్ 175 నిమిషాలుగా లాక్ చేశారు. జనవరి 8న పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి. అలాగే టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వ అనుమతులతో ప్రీమియర్స్, రేట్లపై క్లారిటీ రానుంది.

New Update
Raja Saab Runtime

Raja Saab Runtime

Raja Saab Runtime: ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Director Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన హారర్- ఫాంటసీ సినిమా ‘ది రాజా సాబ్’ జనవరి 9న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్‌ను మేకర్స్ భారీగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాపై ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. ఈ సినిమాకు జనవరి 8న భారత్‌లో పెయిడ్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు.

ఇప్పుడు తాజాగా ఈ సినిమా రన్‌టైమ్ గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమా మూడు గంటలకు పైగా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ తాజా టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘ది రాజా సాబ్’ ఫైనల్ రన్‌టైమ్ 175 నిమిషాలు, అంటే దాదాపు 2 గంటలు 55 నిమిషాలుగా లాక్ చేశారని తెలుస్తోంది. ప్రేక్షకులు ఎక్కువసేపు కూర్చొని చూడాల్సిన అవసరం లేకుండా, సినిమా వేగంగా సాగేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

Also Read:'రాజాసాబ్' క్రేజీ అప్​డేట్.. 'నాచే నాచే' మాస్ సాంగ్ వచ్చేస్తోంది..!

ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. కీలక పాత్రల్లో సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరినా వహాబ్ కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

ఇటీవల కాలంలో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడల్లా ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు అంశం పెద్ద చర్చగా మారుతోంది. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు ప్రభుత్వ అనుమతితో రిలీజ్‌కు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ వేయడం, కొన్నిరోజులు టికెట్ ధరలు పెంచడం సాధారణమైపోయింది. అయితే దీనిపై విమర్శలు కూడా వస్తుండటంతో కొన్ని సందర్భాల్లో కోర్టుల వరకు విషయం వెళ్లిన దాఖలాలు ఉన్నాయి.

Also Read:‘ది రాజా సాబ్’ ప్రభాస్ జోకర్ లుక్ పై డైరెక్టర్ మారుతి షాకింగ్ ట్విస్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, చిన్నా పెద్దా సినిమాలకు టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు అనుమతులు సులభంగా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి సినిమాలకు ఏపీలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రీమియర్స్, టికెట్ రేట్ల పెంపు అనుమతులు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్లాన్ ప్రకారం జనవరి 8 రాత్రి ‘ది రాజా సాబ్’ ప్రీమియర్స్, జనవరి 11 రాత్రి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్స్ ఆంధ్రాలో జరగనున్నాయి. ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.800 వరకు ఉండొచ్చని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అలాగే చిరంజీవి సినిమాకు రూ.500 వరకు ఉండే అవకాశముందని అంటున్నారు. అయితే ఈ ధరలపై పూర్తి స్పష్టత రావాలంటే ఏపీ ప్రభుత్వం విడుదల చేసే అధికారిక జీవో కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.

మొత్తం మీద, రన్‌టైమ్ కంట్రోల్‌లో పెట్టడం, భారీ ప్రమోషన్స్, ప్రీమియర్స్ ప్లాన్‌తో ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఓపెనింగ్ కోసం రెడీ అవుతోందని చెప్పొచ్చు.

Advertisment
తాజా కథనాలు