/rtv/media/media_files/2025/11/02/raja-saab-song-2025-11-02-12-24-20.jpg)
Raja Saab Song
Raja Saab Songs: ఇంతవరకు ప్రబాస్(Prabhas) “ది రాజా సాబ్” సినిమాలోని ఫస్ట్ సింగిల్ విడుదలపై చాలా చర్చ జరుగుతోంది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్-కామెడీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించి, ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ అందుబాటులోకి వచ్చి జరుగుతున్న గందరగోళానికి క్లారిటీ ఇచ్చారు.
#Therajasaab Discussion with skn #Prabhaspic.twitter.com/NlKBuDFFNH
— Darling SAI KIRAN 🤩 (@kiranprabhas09) November 10, 2025
Raja Saab First Single Update
ఎస్‌కేఎన్ ప్రకారం, ఫస్ట్ సింగిల్ విడుదలలో ఆలస్యం ఏర్పడటానికి కారణం ఉత్తర భారత, తెలుగు మార్కెటింగ్ టీమ్‌ల మధ్య చర్చలు అని చెప్పారు. మొదట 'రెబెల్ సాబ్' సాంగ్ విడుదల చేయాలని ప్లాన్ చేశారని, కానీ ఉత్తర భారత పంపిణీదారులు మెలోడి సాంగ్ ను ముందుగా రిలీజ్ చేయమని సూచించారని తెలిపారు. ఈ తేడాల వాళ్ళ చిన్న ఆలస్యం అయ్యిందని తెలిపారు.
Also Read: "బాహుబలి: ది ఎపిక్" విధ్వంసం.. కలెక్షన్ల వివరాలు ఇలా..!
దక్షిణ భారతంలో సింగిల్ లిరికల్ వీడియోలు ఓ హుక్ స్టెప్‌తో మాత్రమే రిలీజ్ చేస్తారు, పూర్తి వీడియోను థియేటర్స్‌లోనే చూడమని ప్రేక్షకులకు వదిలేస్తారు. కానీ ఉత్తర భారతంలో పూర్తి సాంగ్ వీడియోలు ముందుగా రిలీజ్ అవుతాయి. ఈ వ్యత్యాసం కూడా ఆలస్యం కి కారణమని ఎస్‌కేఎన్ చెప్పారు.
ప్రేక్షకులకు మరిన్ని డిటైల్స్ ఇచ్చే విధంగా, సినిమా లో ఐటెం సాంగ్ లేదు, కానీ పాపులర్ హిందీ సాంగ్ రీమిక్స్ ఒక సాంగ్‌గా రెడీ చేసారని తెలిపారు. ప్రతి సాంగ్ మధ్యలో 10–14 రోజుల గ్యాప్ ఇవ్వడం జరుగుతుందని, తద్వారా అభిమానులు మ్యూజిక్ అనుభవాన్ని మంచిగా ఆస్వాదించగలరని చెప్పారు.
Also Read: హోం ఫుడ్‌తో 'ఫౌజీ' సెట్స్‌లో ప్రభాస్ సందడి.. ఫొటోస్ షేర్ చేసిన ఇమాన్వి!
ముఖ్యంగా, ఫస్ట్ సింగిల్ నవంబర్ మూడవ లేదా నాల్గవ వారంలో రిలీజ్ అవ్వనుందని భావిస్తున్నారు. దీని తర్వాత, మూవీ టీమ్ డిసెంబర్ చివరి వరకు మరింత ప్రచారం చేయనుంది, తద్వారా జనవరి 9, 2026, పొంగల్ సీజన్ లో సినిమా ఘనంగా విడుదల అవుతుంది.
Also Read: SSMB29 తాజా అప్‌డేట్: 'గ్లోబ్ ట్రాటర్' నుంచి ప్రియాంక చోప్రా లుక్ వచ్చేస్తోంది..!
ప్రొడ్యూసర్: People Media Factory
మ్యూజిక్ డైరెక్టర్: తమన్ ఎస్
కీలక పాత్రలలో నటించే హీరోయిన్లు: మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్
మొత్తానికి, “ది రాజా సాబ్” అభిమానులకు మంచి మ్యూజిక్ అనుభవం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి సింగిల్ రాక ముందు అభిమానుల మధ్య ఆసక్తి మరింత పెరిగిపోయింది, అన్ని సాంగ్స్ ఒకటి తర్వాత ఒకటి అవ్వనున్నాయి.
Follow Us