/rtv/media/media_files/2025/08/19/pournami-4k-re-release-2025-08-19-19-11-09.jpg)
Pournami 4K Re-Release
Pournami 4K Re-Release: పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్(Prabhas) భారీ క్రేజ్‌ను పొందిన విషయం అందరికీ తెలిసిందే. వరుస బిగ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న డార్లింగ్ ప్రభాస్, త్వరలో "రాజా సాబ్" సినిమాతో ప్రేక్షకులను మరోసారి సర్ప్రైజ్ చేయనున్నారు. ఫస్ట్ టైమ్ డార్లింగ్ హారర్ మూవీలో నటిస్తుండడంతో ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంతకంటే ముందు డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఒక గుడ్ న్యూస్ వచ్చింది. 2006లో విడుదలైన ప్రభాస్ సినిమా పౌర్ణమి మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది. అయితే విడుదలకి ఇంకా 30రోజులు మాత్రమే ఉండడంతో మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ ను " కౌంట్ డౌన్ స్టార్ట్" అనే క్యాప్షన్ తో రిలీజ్ చేశారు.
The Countdown Begins !
— Aditya Music (@adityamusic) August 19, 2025
30Days To Go #Pournami4K Grand Re-Release 🔥
REBEL STAR #Prabhas@trishtrashers@Charmmeofficial@PDdancing@ThisIsDSP@MSRajuOfficial@adityamusicpic.twitter.com/hKS1h57cwE
అయితే, ఈ మూవీ క్వాలిటీని పెంచి, 4K రిజల్యూషన్, డాల్బీ ఆడియోతో సెప్టెంబర్ 19న గ్రాండ్ రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అప్పట్లో ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, మెల్లగా ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్‌గా మారింది.
Also Read: ప్రభాస్ గురించి అప్పుడే అనుకున్నా.. మనసులో మాట బయటపెట్టిన శ్రీదేవి..
‘పౌర్ణమి’ ప్రత్యేకతేంటి?
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా త్రిష నటించగా, ఛార్మి కౌర్ కీలక పాత్రలో కనిపించారు. వీరి మద్య స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో అభిమానుల్ని ఆకట్టుకుంది. ‘వర్షం’ తర్వాత ప్రభాస్త్రి-ష జోడీ మరోసారి మెప్పించిన సినిమా ఇదే. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎంఎస్ రాజు నిర్మించారు. నాట్యకళ చుట్టూ తిరిగే కథ, కుటుంబ బంధాలు, ప్రేమ - ఇవన్నీ కలగలిపి ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకంగా నిలిచింది.
'పౌర్ణమి'కి ప్రాణం పోసిన సంగీతం..
ఈ సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఇప్పటికీ ఎంతో ఫేమస్. “మువ్వలా నవ్వకలా” వంటి పాటలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. చంద్రబోస్ రాసిన సాహిత్యం, ప్రభాస్ ఎనర్జిటిక్ డాన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కథలోని భావోద్వేగాలు, నాట్య కళకు ఇచ్చిన ప్రాధాన్యత, విజువల్స్ అన్నీ కలసి సినిమాను క్లాసికల్ హిట్ గా నిలిపాయి.. ఇప్పటి టెక్నాలజీతో సినిమాను రీమాస్టర్ చేసి, 4K వర్షన్‌తో, డాల్బీ సౌండ్‌తో థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. దీంతో కొత్త జనరేషన్‌కి పౌర్ణమి కొత్తగా పరిచయం కానుంది.
ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని పొందిన పౌర్ణమి మళ్లీ తెరపైకి రావడం అభిమానులకే కాదు సినిమా ప్రియులకు కూడా ఓ పండుగ లాంటిదే. ట్రెడిషనల్ టచ్‌తో, క్లాసికల్ సంగీతంతో, అందమైన కథనంతో అలరించిన ఈ చిత్రం మరింత మెరుగైన విజువల్స్‌తో మరోసారి మన ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 19న థియేటర్లలో కలుద్దాం - ‘పౌర్ణమి’ మ్యాజిక్ ని మళ్లీ ఆస్వాదిద్దాం!