/rtv/media/media_files/2025/08/19/prabhas-fauji-look-leaked-2025-08-19-15-36-57.jpg)
Prabhas Fauji Look Leaked
Prabhas Fauji Look: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. బాహుబలి(Baahubali The Epic) లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఆయన రేంజ్ పెరిగిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుండి వరుసగా భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నారు. కల్కి, సలార్ వంటి చిత్రాలు భారీ బడ్జెట్ తో రూపొంది బాక్సఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక రాబోయే చిత్రాలు కూడా అన్ని భారీ బడ్జెట్ సినిమాలు కావడం విశేషం. అందులో సందీప్ రెడ్డి వంగా తో 'స్పిరిట్', అలాగే హను రాఘవపుడితో 'ఫౌజీ' మూవీస్ ఉన్నాయి. అయితే ప్రభాస్ నటించిన ఏ సినిమా గురించి అయినా చిన్న అప్డేట్ వచ్చినా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం కామన్. తాజాగా ఆయన చేస్తున్న కొత్త సినిమా "ఫౌజీ"కి(Prabhas Fauji Movie) సంబంధించిన లుక్స్, సెట్స్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Also Read: వంగా మేకింగ్ మామూలుగా లేదు.. 'స్పిరిట్' ఫస్ట్ షెడ్యూల్ అక్కడ ప్లానింగ్!
వింటేజ్ లుక్ లో డార్లింగ్..
ఇటీవలే ప్రభాస్, కన్నప్ప సినిమాలో "రుద్ర" పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు. ఇప్పుడు ఫౌజీ సినిమాలోని ఆయన సైనికుడి పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమా కి సంబంధించి ప్రభాస్ లుక్ ఒకటి తాజాగా లీక్ అయ్యింది(Fauji Movie Prabhas Look Leak). ఈ లుక్ చూసి అభిమానులు డార్లింగ్ వింటేజ్ లుక్ లో అదిరిపోయాడంటూ ఆనందపడిపోతున్నారు.
#Prabhas is back 🔥🔥🥰
— Roy Adarsh (@BrkRoy6036) August 19, 2025
New Look Leaked 🔥🔥🔥#Prabhas#PrabhasHanu#prabhasfauji#faujimovie#spiritpic.twitter.com/VSldhcRqUy
ఇక ఈ సినిమా కథ 1940ల బ్రిటీష్ పాలనలో ఉన్న భారతదేశాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతోంది. ప్రపంచ యుద్ధం నడుస్తున్న సమయంలో జరిగే ఓ సైనికుడి ప్రేమకథ ఇది. అందుకే ఈ సినిమాలో దేశభక్తి, యుద్ధం, ప్రేమ అనే మూడు ప్రధాన అంశాలను డైరెక్టర్ హను చాలా బలంగా చూపించనున్నాడు.
సినిమాలో ప్రభాస్ ఒక భారత సైనికుడిగా కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా ట్రాన్స్‌ఫార్మేషన్ చేసినట్టు తెలుస్తోంది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్ కావడంతో, సెట్ డిజైనింగ్, యాక్షన్ సన్నివేశాలు, వార్ ఎఫెక్ట్స్ అన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించబోతున్నారు.
ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లు వేసి, ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓ జైలు సెట్, ఆర్మీ క్యాంప్ లాంటి సెట్స్ ఇప్పటికే లీకై నెట్టింట్లో ఫుల్ వైరల్ అయిన విషయం తెలిసిందే.
Vanduu danekkkkkkkkka Vanduuuuu
— RAAJASAAB🔥🔥 (@vap_gamer) August 19, 2025
💥💥💥💥💥💥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥#prabhas#PrabhasHanu 😭❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/n5WOWD54o7
ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 700 కోట్ల వరకు ఉంటుందని టాక్. ఇది ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా నిలవనుందని తెలుస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి, గతంలో "సీతా రామం" లాంటి హిట్ సినిమా తీసాడు. ఇప్పుడు ఈ సినిమాను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది, అభిమానులు మాత్రం అధికారిక అప్డేట్స్(Prabhas Fauji Latest Updates) కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ యాక్షన్, ఎమోషన్, లుక్ అన్ని ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ టీజర్ గానీ, ఫస్ట్ గ్లిమ్స్ గానీ రిలీజ్ చేస్తారని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.