/rtv/media/media_files/2025/08/19/sridevi-vijaykumar-2025-08-19-17-21-56.jpg)
Sridevi Vijaykumar
Sridevi Vijaykumar: శ్రీదేవి విజయ్ కుమార్ ఈ పేరు మనలో చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ప్రభాస్ మొదటి సినిమాలో నటించిన హీరోయిన్(Prabhas First Movie Heroine) మనందరికీ గుర్తే ఉంటుంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ కొన్ని సంవత్సరాల విరామం తర్వాత తిరిగి వెండితెరపై కనిపిస్తోంది, తన తాజా చిత్రం ‘సుందరకాండ’ గురించి ఇటీవల ఓ ఈవెంట్ లో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, శ్రీదేవితో పాటు వృతి వాఘానీ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది.
ఈ సందర్బంగా శ్రీదేవి మాట్లాడుతూ - "సుందరకాండ సినిమా(Sundarakanda Movie) స్టోరీ వినగానే నాకు షాక్ అనిపించింది. చాలా ఫ్రెష్ స్టోరీ. ఇందులో నాకు ఒక బలమైన పాత్ర దక్కింది. ప్రతి ఒక్కరూ థియేటర్‌కు వెళ్లి కూడాల్సిన సినిమా," అని చెప్పారు. అలాగే తన కెరీర్ గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడారు.
“హీరోయిన్‌గా పీక్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని, తల్లి అయ్యాను. ఆ తర్వాత కొన్ని టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు నా కూతురు పెరిగి పెద్దయి స్కూల్‌కి కూడా వెళుతోంది. అలా చూసుకుంటే నేను మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ఇదే సరైన టైమ్ అనిపించింది,” అని చెప్పుకొచ్చింది శ్రీదేవి, సినిమాల్లో మళ్లీ తన రీఎంట్రీపై సంతోషం వ్యక్తం చేసింది.
ఈ మూవీలో స్కూల్ డ్రెస్‌లో కనిపించే ఒక సన్నివేశం కోసం తాను ప్రత్యేకంగా డైట్ ఫాలో అయ్యారట. “నేను, నా కూతురు ఇద్దరం స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు ఉన్నాయి. అవి నా జీవితంలో ఎంతో మధురమైన జ్ఞాపకాలు,” అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రభాస్ నా బెస్ట్ హీరో..
గతంలో ప్రభాస్‌తో చేసిన తన మొదటి సినిమా ‘ఈశ్వర్’ గురించి కూడా శ్రీదేవి మాట్లాడారు. "ఈశ్వర్ సినిమా ద్వారా నేను హీరోయిన్‌గా పరిచయం అయ్యాను. అదే సమయంలో ప్రభాస్ కూడా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే అతనిలో ఓ పెద్ద స్టార్ అవే లక్షణాలు కనిపించాయి. ఇప్పుడు ప్రభాస్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. అది చూసి నిజంగా చాలా గర్వంగా ఉంది. ఆయన దానికి పూర్తిగా అర్హుడు. ప్రభాస్ అప్పట్లో ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలాగే ఉన్నారు. అంతే భాద్యతతో, అంతే సరదాగా ఉంటారు. చిన్న పిల్లలలా మెలుగుతారు,” అని చెప్పుకొచ్చారు.
“ఫస్ట్ సినిమా కావడం వల్ల మాకు ఇద్దరికీ అప్పట్లో చాలా టెన్షన్ ఉండేది. ఒకటి కాదు మా మధ్య అనేక జ్ఞాపకాలూ ఉన్నాయి. ఈశ్వర్ సినిమా మా జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రాజెక్ట్,” అంటూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు శ్రీదేవి విజయ్ కుమార్.