'కల్కి' పార్ట్-2 టైటిల్ ఫిక్స్.. ఈసారి అంతకుమించి

'కల్కి' పార్ట్ 2 కు 'కర్ణ 3102 BC' అనే టైటిల్ నిర్ణయించారట. ఇందులో కర్ణుడు, అశ్వద్ధామ హీరోలు కాగా.. విలన్‌గా సుప్రీం యాష్కిన్ కనిపిస్తాడట. కల్కి లో మహాభారతం సీన్లతో గూస్ బంప్స్ తెప్పించిన నాగ్ అశ్విన్.. పార్ట్ 2 లో అంతకు మించి ప్లాన్ చేసినట్లు సమాచారం.

kalki 2
New Update

ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ 'కల్కి 2898AD'. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ సునామీ సృష్టించింది. రూ. 1100 కోట్లతో అత్యధిక వసూళ్ళను సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలోని విజువల్స్, స్టోరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా పార్ట్ - 2 ఉండబోతుందని మూవీ క్లైమాక్స్ లో హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ మూవీ టీమ్ పార్ట్ - 2 కు సంబంధించి కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. ఇప్పటికే వచ్చిన 'కల్కి' తొలి భాగంలో భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. చివర్లో మహాభారతం ఎపిసోడ్, అందులో కర్ణుడు-అర్జునుడు సీన్స్ సూపర్ హైలైట్ అయ్యాయి. ఇక పార్ట్ -2 లో మొత్తం కర్ణుడి గురించే చెప్పబోతున్నారు.

Also Read : యాక్షన్ తో అదరగొట్టిన ఎన్టీఆర్.. 'దేవర' రిలీజ్ ట్రైలర్ చూశారా?

టైటిల్ అదేనా?

అందుకే 'కల్కి' పార్ట్ - 2 కు  'కర్ణ 3102 BC' అనే టైటిల్ నిర్ణయించారట మేకర్స్.ఇందులో కర్ణుడు, అశ్వద్ధామ హీరోలు కాగా.. విలన్‌గా సుప్రీం యాష్కిన్ కనిపిస్తాడట. కల్కి లో జస్ట్ కొద్ది నిమిషాలే భారతం సీన్లతో గూస్ బంప్స్ తెప్పించిన నాగ్ అశ్విన్.. పార్ట్ - 2 లో అంతకు మించి ప్లాన్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కాగా పార్ట్-2 పెండింగ్ షూటింగ్ జనవరి నుంచి మొదలు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇక ప్రభాస్ త్వరలో.. హను రాఘవపూడి సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో ఈ సినిమా రానుండ‌గా.. ప్రభాస్‌ ఈ సినిమాలో బ్రిటీష్‌సైనికుడిగా కనిపించనున్నారు. డార్లింగ్ సరసన ఇమాన్ ఎస్మాయిల్  హీరోయిన్‌గా న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

#prabhas #kalki2898ad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి