'కల్కి' పార్ట్-2 టైటిల్ ఫిక్స్.. ఈసారి అంతకుమించి 'కల్కి' పార్ట్ 2 కు 'కర్ణ 3102 BC' అనే టైటిల్ నిర్ణయించారట. ఇందులో కర్ణుడు, అశ్వద్ధామ హీరోలు కాగా.. విలన్‌గా సుప్రీం యాష్కిన్ కనిపిస్తాడట. కల్కి లో మహాభారతం సీన్లతో గూస్ బంప్స్ తెప్పించిన నాగ్ అశ్విన్.. పార్ట్ 2 లో అంతకు మించి ప్లాన్ చేసినట్లు సమాచారం. By Anil Kumar 22 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ 'కల్కి 2898AD'. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ సునామీ సృష్టించింది. రూ. 1100 కోట్లతో అత్యధిక వసూళ్ళను సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలోని విజువల్స్, స్టోరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా పార్ట్ - 2 ఉండబోతుందని మూవీ క్లైమాక్స్ లో హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ మూవీ టీమ్ పార్ట్ - 2 కు సంబంధించి కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. ఇప్పటికే వచ్చిన 'కల్కి' తొలి భాగంలో భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. చివర్లో మహాభారతం ఎపిసోడ్, అందులో కర్ణుడు-అర్జునుడు సీన్స్ సూపర్ హైలైట్ అయ్యాయి. ఇక పార్ట్ -2 లో మొత్తం కర్ణుడి గురించే చెప్పబోతున్నారు. Also Read : యాక్షన్ తో అదరగొట్టిన ఎన్టీఆర్.. 'దేవర' రిలీజ్ ట్రైలర్ చూశారా? టైటిల్ అదేనా? అందుకే 'కల్కి' పార్ట్ - 2 కు 'కర్ణ 3102 BC' అనే టైటిల్ నిర్ణయించారట మేకర్స్.ఇందులో కర్ణుడు, అశ్వద్ధామ హీరోలు కాగా.. విలన్‌గా సుప్రీం యాష్కిన్ కనిపిస్తాడట. కల్కి లో జస్ట్ కొద్ది నిమిషాలే భారతం సీన్లతో గూస్ బంప్స్ తెప్పించిన నాగ్ అశ్విన్.. పార్ట్ - 2 లో అంతకు మించి ప్లాన్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కాగా పార్ట్-2 పెండింగ్ షూటింగ్ జనవరి నుంచి మొదలు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ త్వరలో.. హను రాఘవపూడి సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో ఈ సినిమా రానుండగా.. ప్రభాస్ ఈ సినిమాలో బ్రిటీష్‌సైనికుడిగా కనిపించనున్నారు. డార్లింగ్ సరసన ఇమాన్ ఎస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. #prabhas #kalki2898ad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి