Prabhas Birthday: ప్రభాస్ - హను సినిమా టైటిల్‌ "ఫౌజీ" కాదా..? ఫ్యాన్స్ లో కొత్త డౌట్..!

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ మూవీ టైటిల్‌పై ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తాజా పోస్టర్‌ ఆధారంగా సినిమాకు "ఫౌజీ" అనే పేరే ఫిక్స్ అంటూ భావిస్తున్నారు. కథ 1940ల బ్రిటీష్ పాలనలో జరిగే యుద్ధ నేపథ్యంతో ఉండనుందట.

New Update
Prabhas Fauzi

Prabhas Fauzi

Prabhas Birthday: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా గురించి తాజాగా ఓ పోస్టర్‌ రిలీజ్ చేస్తూ, సినిమా టైటిల్‌ను గురువారం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా (Prabhas Birthday Special) ప్రకటిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది.

అయితే, పోస్టర్‌లోని హింట్స్‌ను ఆధారంగా తీసుకుని అభిమానులు ఇప్పటికే టైటిల్‌ను ఊహించేశారు. వాళ్లంతా ఈ సినిమాకు టైటిల్ "ఫౌజీ" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పోస్టర్‌లో ఏముందంటే..?

మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్లలో "Z" అక్షరం స్పష్టంగా కనిపించడంతో, ఇది "ఆపరేషన్ Z" అనే ప్రాజెక్ట్‌పై ఆధారపడిన కథగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంకా, కాస్ట్యూమ్ డిజైనర్ షీతల్ ఇక్బాల్ శర్మ తమ ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో ఈ పోస్టర్లను “Fauzi” అని సేవ్ చేయడంతో ఫ్యాన్స్ ఈ సినిమా పేరు 'ఫౌజీ'నే(Prabhas Fauzi) అని ఫిక్సయిపోయారు.

ఈ సినిమా కథ 1940ల బ్రిటీష్ పాలనలో జరిగే యుద్ధ నేపథ్యానికి సంబంధించినది. ఇందులో ప్రభాస్ ఒక యుద్ధసైనికుడిగా కనిపించబోతున్నారని టాక్. కొంతమంది అభిమానులు ఈ సినిమా కథలో ప్రభాస్ ఓ బ్రిటీష్ సైనికుడిగా, తర్వాత తన దేశాన్ని ప్రేమించి తిరుగుబాటు చేసే క్యారెక్టర్‌లో ఉంటాడని ఊహిస్తున్నారు. ఇది మహాభారతంలోని కర్ణుని పాత్ర లాగా ఉండొచ్చని కూడా అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు ఇమాన్వి, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి పెద్ద నటులు నటిస్తున్నారు.

టైటిల్ అనౌన్స్మెంట్ రేపే!

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ టైటిల్‌ను గురువారం అధికారికంగా ప్రకటించనుంది. అప్పటి వరకూ అభిమానుల ఊహాగానాలకు అంతే లేదు! పోస్టర్‌లోని సంకేతాలు, క్యాప్షన్‌లను ఆధారంగా తీసుకుని "ఫౌజీ" అనే పేరు ఫిక్స్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో పెద్ద మైలురాయిగా మారబోతోందనే నమ్మకం ఫ్యాన్స్‌ లో ఉంది.

Advertisment
తాజా కథనాలు