Prabhas : ప్రభాస్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కు నిరాశ.. కారణం అదే!

ప్రభాస్ బర్త్ డే రోజు మైత్రీ మూవీ మేకర్స్ అభిమానుల‌కు షాక్ ఇచ్చింది. మొదట హను రాఘవపూడి, ప్రభాస్ మూవీ అప్డేట్ ఇస్తామని చెప్పి లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చింది. ఈ మేరకు సింపుల్ గా ప్రభాస్ పిక్ పోస్ట్ చేస్తూ మూవీ అప్‌డేట్‌ను మ‌రో ప్ర‌త్యేక‌ రోజున ఇస్తామంటూ ప్రకటించింది.

gklh
New Update

పాన్ ఇండియా హీరో ప్రభాస్ బర్త్ డే రోజున ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అందుకు ఓ కారణం కూడా ఉంది. ఆ డార్లింగ్ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసింది ఎవరో కాదు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. నేడు ప్రభాస్ బర్త్ డే కావడంతో ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చాయి. 

'రాజాసాబ్' నుంచి ప్రభాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్పెష‌ల్ గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా.. మ‌రోవైపు 'స‌లార్ 2' మూవీ షూటింగ్ ప్రారంభించిన‌ట్లు హోంబాలే బ్యాన‌ర్ ప్ర‌క‌టించింది. అయితే ఈ సినిమాల‌తో పాటు ప్ర‌భాస్.. హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. 

Also Read : 'కంగువ' ఆ హాలీవుడ్ సినిమాల తరహాలో ఉంటుంది.. అంచనాలు పెంచేసిన సూర్య

అయితే ఈ మూవీ దర్శకుడి హను రాఘవపూడి తన సోషల్ మీడియాలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అప్‌డేట్ ఇవ్వ‌నున్న‌ట్లు పోస్ట్ పెట్టారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆ అప్డేట్ ఏమై ఉంటుందా? అని ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ లేక ప్రభాస్ ఫస్ట్ లుక్ వస్తుందేమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. కట్ చేస్తే.. ఈ సినిమా అప్‌డేట్ ఇప్పుడు ఇవ్వ‌లేమ‌ని చిత్ర‌బృందం అభిమానుల‌కు షాక్ ఇచ్చింది. 

నో అప్డేట్..

జస్ట్ మూవీ లాంచ్ లో ప్రభాస్ పాల్గొన్న ఫొటోను షేర్ చేస్తూ.." డియ‌ర్ రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్.. డార్లింగ్‌ను రాజా సాబ్‌లోని న్యూ లుక్‌లో మీరు చూశారు. ఈ స్పెష‌ల్ డే నాడు ఇది ఎంజాయ్ చేయండి. ప్ర‌భాస్ – హను రాఘవపూడి సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను మ‌రో ప్ర‌త్యేక‌ రోజున విడుద‌ల చేస్తాం.." అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ప్ర‌క‌టించింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనున్న ఈ సినిమాలో   ఇమాన్ ఎస్మాయిల్ హీరోయిన్‌గా నటించనుంది.

Also Read : నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'వేట్టయన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

#prabhas #happy-birthday-prabhas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe