హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో తనదైన లవ్ స్టోరీస్ తో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడితో ప్రభాస్ మొదటి సారి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గానే ఈ మూవీ గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
ఈ మూవీ లాంచ్ ఈవెంట్ కు సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటూ పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. రీసెంట్ గానే ఈ మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయింది. 'ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా తమిళనాడులోని మధురైలో జరుపుకుంటుంది. అయితే ఈ షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనడంలేదు.
దసరాకు గ్లింప్స్..
రెండో షెడ్యూల్ నుంచి పాల్గొంటారని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదిలావుంటే ఈ మూవీ నుంచి దసరా కానుకగా గ్లింప్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ న్యూస్ కాస్త ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.
Also Read : తిరుమల లడ్డు వివాదంపై మంచు మోహన్ బాబు స్పందన.. నీచం, నికృష్టం అంటూ
స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో ఈ సినిమా రానుండగా.. ప్రభాస్ ఈ సినిమాలో బ్రిటీష్సైనికుడిగా కనిపించనున్నారు. డార్లింగ్ సరసన ఇమాన్ ఎస్మాయిల్ హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.