Prabhas AI Video: "కేక్ కట్ చేస్తున్న బాహుబలి.. కుకింగ్ చేస్తున్న సలార్".. ఏం క్రియేటివిటీ రా అయ్యా!

రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఫ్యాన్స్ క్రియేట్ చేసిన AI వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాహుబలి గెటప్‌లో కేక్ కట్ చేయడం, సలార్ లుక్‌లో వంట చేయడం ఉన్న ఈ వీడియోని డార్లింగ్ అభిమానులు ఆనందంగా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు.

New Update
Prabhas AI Video

Prabhas AI Video

Prabhas AI Video: రెబల్ స్టార్ ప్రభాస్‌ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన AI వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రభాస్ ‘బాహుబలి’ గెటప్‌లో కేక్ కట్ చేస్తూ, ‘సలార్’ లుక్‌లో వంట చేస్తూ ఫన్నీగా కనిపిస్తున్నాడు.  దీనిని చూసి అభిమానులు ఎంతో ఆనందంగా షేర్‌ చేస్తూ, పండగ చేసుకుంటున్నారు.

భారత సినిమా ప్రపంచంలో ప్రభాస్ ఒక అగ్రనాయకుడిగా గుర్తింపు పొందాడు. వరుస సినిమాలతో తన అద్భుత నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు(Prabhas Birthday) కావడంతో ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో #HappyBirthdayPrabhas హ్యాష్‌ట్యాగ్‌తో ఆయనకు విపరీతమైన ప్రేమను  తెలుపుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర ప్లాట్‌ఫామ్లలో ప్రభాస్ పోస్టులతో ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. 

స్పెషల్ మ్యాష్‌అప్ వీడియో

ఈ సందర్భంగా గీత ఆర్ట్స్ సంస్థ కూడా ప్రభాస్‌కి ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చింది. వారు విడుదల చేసిన స్పెషల్ మ్యాష్‌అప్ వీడియో అలరిస్తోంది. “అర్జునుడి లాంటి రూపం, శివుడి లాంటి బలం, రాముడి లాంటి గుణం” అంటూ ప్రారంభమయ్యే ఈ వీడియోలో ప్రభాస్ నటించిన పలుసినిమాల సన్నివేశాలు, డైలాగులు, యాక్షన్ షాట్లు అద్భుతంగా ఎడిట్ చేసారు. ఆ ఎలివేషన్ చూస్తే అభిమానులకు గూస్‌బంప్స్ వచ్చేలా ఉన్నాయి.

‘బాహుబలి’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ ఇప్పుడు ‘సలార్’, ‘కల్కి 2898 AD’ వంటి పాన్ ఇండియా చిత్రాలతో మరింత క్రేజ్ సంపాదించాడు. భారీ బడ్జెట్ సినిమాలు, అంతర్జాతీయ ప్రమోషన్లు ఆయనను భారతదేశం అంతటా బిగ్ స్టార్‌గా నిలిపాయి.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 7 భారీ సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ పార్ట్ 2’, ‘కల్కి 2898 AD పార్ట్ 2’ వంటి భారీ ప్రాజెక్టులు ఉంటాయి. అలాగే మరో రెండు సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయి. భారీ లైన్‌అప్ తో ప్రభాస్ సినీ పరిశ్రమలో బిజీ హీరోగా కొనసాగుతున్నారు.

ఇన్ని సినిమాలతో ప్రభాస్ తన అభిమానులను ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులను కూడా అలరిస్తున్న ప్రభాస్ భవిష్యత్తులో మరిన్ని హిట్ సినిమాలతో తన క్రేజ్‌ను కొనసాగిస్తాడనే అంతా అనుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు