/rtv/media/media_files/2025/07/26/pournami-movie-re-release-2025-07-26-20-36-28.jpg)
Pournami Movie Re Release
Pournami Movie Re Release:
ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి అదిరిపోయే గుడ్ న్యూస్.. టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది. స్టార్ హీరోల క్లాసిక్ సినిమాలు మళ్లీ థియేటర్లకు వస్తూ, అభిమానులకు నాస్టాల్జిక్ ఫీలింగ్ కలిగిస్తున్నాయి. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఓల్డ్ క్లాసిక్ మూవీ ‘పౌర్ణమి’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 19, 2025 న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
Also Read:"హరి హర వీరమల్లు" బొ*క్కలా ఉంది.. నెటిజన్ కామెంట్ కి నిధి పాపా దిమ్మతిరిగే రిప్లై..
/filters:format(webp)/rtv/media/media_files/2025/07/26/pournami-4k-2025-07-26-20-36-53.jpg)
2006లో విడుదలైన ఈ సినిమా, అప్పట్లో భారీ అంచనాల మధ్య విడుదలై, మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. అయినప్పటికీ, దాంట్లోని విజువల్స్, సంగీతం, కథనం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఎనర్జిటిక్ డాన్సులు, రొమాంటిక్ పెర్ఫార్మన్స్, ట్రెడిషనల్ కాన్సెప్ట్ , మాస్ & క్లాస్ ఎలెమెంట్స్ ఇవన్నీ సినిమాకు హైలైట్స్‌గా నిలిచాయి.
Also Read:కొంప'ముంచిన' గూగుల్ మ్యాప్.. కార్ తో వాగులోకి దూసుకెళ్లిన మహిళ
డాన్స్ మాస్టర్ ప్రభు దేవా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ లిరిక్స్ తో ప్రేక్షకులను అలరించింది. పూజా (త్రిష) & శివశంకర్ (ప్రభాస్) మధ్య సాగిన కథలో మన సంప్రదాయ నృత్యానికి, కుటుంబ విలువలకు ప్రధాన్యత ఇచ్చిన సినిమా ఇది. పౌర్ణమి ఒక క్లాసిక్ ఎమోషనల్ డ్రామాగా ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయింది.
#Pournami4K Re-Releasing In Theatres Again On September 19th 🔱❤️🔥
— The Cine Gossips (@TheCineGossips) July 26, 2025
Step into the world of ULTRA-HIGH definition 💥 pic.twitter.com/t6saZDVRrk
ఈసారి రీ రిలీజ్ సందర్భంగా సినిమాను డిజిటల్‌గా రిమాస్టర్ చేసి, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అధునాతన డాల్బీ ఆడియో, 4K క్వాలిటీతో థియేటర్ క్వాలిటీ బాగుంటుందని నిర్మాతలు చెబుతున్నారు.
ప్రస్తుతం ‘సలార్’, ‘ది రాజాసాబ్’, ‘స్పిరిట్’ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్, తెరపై మళ్లీ పాత గెటప్‌లో కనిపించబోతుండడంతో ఫ్యాన్స్‌కు ఇది ఓ స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రీ రిలీజ్ పై భారీగా హైప్ క్రియేట్ అవుతోంది.