పాలిటిక్స్ నుంచి పోసాని ఎందుకు తప్పుకున్నాడు.. షాకింగ్ నిజాలు! పోసాని కృష్ణ మురళి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి వైఎస్ జగన్ ముఖ్య కారణమని తెలుస్తోంది. ఇటీవల ఆర్జీవీ కేసు విషయమై మాట్లాడిన జగన్.. పోసాని ప్రస్తావన కూడా తీసుకురాలేదు. దీని కారణంగానే పోసాని వైసీపీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. By Seetha Ram 23 Nov 2024 in సినిమా ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి పోసాని కృష్ణ మురళిపై ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మరికొన్ని చోట్ల కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో అతడు రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. ఇకపై రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. దీనికి ముఖ్య కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: నకిలీ RTO ఘరానా మోసం.. ఈ ట్విస్టు ఊహించడం కష్టమే భయ్యా! జగన్ మద్దతు దారుడిగా పోసాని గత దశాబ్ద కాలంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తిరుగులేని మద్దతు దారుడిగా పోసాని పేరుగాంచాడు. ప్రతిపక్ష విమర్శలకు వ్యతిరేకంగా నాయకుడిని నిలకడగా సమర్థించాడు. తమ నాయకుడిని ఎవరైనా ఏదైనా అంటే.. దానికి ధీటుగా కౌంటర్ వేసేవాడు. అవతల వ్యక్తి ఎంతటి పెద్ద లీడర్ అయినా ఊరుకునే వాడు కాదు. మొన్నటి వరకు సపోర్ట్ గానే ఉన్నాడు. కానీ ఇప్పుడాయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: తెలంగాణలో 13 నర్సింగ్ కాలేజీలకు అనుమతి జగన్ వైఖరితో పోసాని నిరాశ దానికి కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి అని సమాచారం. అందుకే వైసీపీతో పాటు రాజకీయాలకు సైతం గుడ్ బై చెప్పి ఉంటారని గుస గుసలు వినిపిస్తున్నాయి. జగన్ కోసం, వైసీపీ కోసం సర్వం త్యాగం చేసినా.. తనకు గుర్తింపు లేదనే భావనలో పోసాని కృష్ణ మురళి ఉన్నట్లు సమాచారం. పోసానిపై ఇన్ని ఫిర్యాదులు, కేసులు నమోదు అవుతున్నా.. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు పోసానిని వ్యక్తిగతంగా సంప్రదించలేదని, మద్దతు ఇస్తామని హామీ ఇవ్వలేదని వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవలే వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దర్శకుడు రాంగోపాల్ వర్మ, వైఎస్ అవినాష్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డిల కేసు విషయమై ప్రస్తావించారు. కానీ పోసాని గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడంతో అతడు మనస్థాపం చెంది ఉంటారని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఆర్జీవి వైసీపీ కూడా కాదు. అలాంటి వ్యక్తి విషయంలో స్పందించిన జగన్.. పోసాని విషయంపై మాట్లాడకపోవడంతోనే అతడు నిరాశ చెంది వైసీపీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఉంటారని అనుకుంటున్నారు. ఇక కుటుంబ సభ్యుల నుంచి కూడా పోసానిపై ఒత్తిడి వచ్చిందని.. తాను నమ్మిన నాయకుడు తనకు సపోర్ట్‌గా నిలవలేదని.. ఈ కష్ట సమయాల్లో తన కుటుంబం మాత్రమే తనకు అండగా నిలుస్తుందని గ్రహించి రాజకీయాలను విడిచిపెట్టారని చెబుతున్నారు. తనపై ఎన్ని కేసులు నమోదు అయినా భయపడని పోసాని.. జగన్ నుంచి తగిన ఆదరణ లభించకపోవడంతోనే ఆవేదన చెంది గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. #posani-krishna-murali #ys-jagan #chandrabau మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి