Jani Master: పరారీలో జానీ మాస్టర్.. ఆచూకీ కోసం పోలీసుల వేట!

జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పరారీలో ఉన్న అతని ఆచూకీ కోసం పోలీసులు నాలుగు బృందాలుగా వేట మొదలు పెట్టారు. అయితే జానీ మాస్టర్ ఉత్తరాది రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది.

author-image
By V.J Reddy
Jani Master
New Update

Jani Master: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పరారీలో ఉన్నాడు. జానీ మాస్టర్‌ కోసం పోలీసుల గాలింపు చర్యలు ప్రారంభించారు. మొత్తం 4 బృందాలుగా ఏర్పడి వెతుకాలట ప్రారంభించారు పోలీసులు. నెల్లూరులో, ముంబైలో, లఢక్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతుండగా.. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

తన ఫోన్‌లు ఆఫ్ చేసి బంధువులు, ఫ్రెండ్స్ ఫోన్లతో లాయర్లతో మాట్లడుతున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు.. అతని అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్‌ కోసం జానీ మాస్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు. నాన్ బెయిలబుల్ కేసులు ఉండటంతో ఏం చేయాలనే దానిపై లీగల్ ఒపీనియన్ ను జానీ మాస్టర్ తీసుకుంటున్నట్లు సమాచారం.

Also Read :  ఏలూరు జిల్లాలో దారుణం.. హాస్టల్ విద్యార్థునులపై అత్యాచారం!

మహిళా కమిషన్‌లోనూ..

మహిళా కమిషన్‌లోనూ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీబాషాపై ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు బాధితురాలితో కలిసి పలు మహిళా సంఘాల నాయకులు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ 40పేజీలతో కూడిన లేఖను బాధితురాలు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద కు ఇచ్చారు. బాధితురాలికి అండగా ఉంటామని.. ఈ విషయాన్నీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆమె బాధితురాలికి హామీ ఇచ్చారు.

Also Read :  భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో-కారు ఢీ.. ఒకరి మృతి!

పలు సెక్షన్ల కింద..

జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. అతని దగ్గర పని చేసే అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ జానీ పై లైంగిక ఆరోపణల కేసు పెట్టడం ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై పోలీసులు IPC 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read :  హెజ్‌బొల్లాకు పేజర్ల మృత్యు సందేశం!

పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు

అయితే తాజాగా జానీ మాస్టర్ కేసులో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. అతని పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ వేధింపులకు పాల్పడ్డాడని తెలియడంతో పోక్సో కేసు పెట్టారు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ ప్రస్తుతం లడఖ్ లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జానీ కోసం వేట మొదలు పెట్టారు.

Also Read :  చూస్తుండగానే కుప్పకూలిన రెండతస్తుల భవనం!

#tollywood #jani-master
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe