BIG BREAKING : హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదు!

హీరో విజయ్ దేవరకొండకు బిగ్ షాక్ తగిలింది. లాయర్ కిషన్‌ చౌహాన్‌ ఫిర్యాదు మేరకు కేసు ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా వెళ్లిన విజయ్  సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
vijay sr nagar

vijay sr nagar

హీరో విజయ్ దేవరకొండకు బిగ్ షాక్ తగిలింది. లాయర్ కిషన్‌ చౌహాన్‌ ఫిర్యాదు మేరకు కేసు ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా వెళ్లిన విజయ్  సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ఆదివాసులపై అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారంటూ కిషన్ చౌహాన్‌ ఫిర్యాదులో తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉగ్రవాదుల గురించి మాట్లాడబోయి

కాగా హీరో విజయ్ రెట్రో ఈవెంట్ లో  పాకిస్తాన్ ఉగ్రవాదుల గురించి మాట్లాడబోయి గిరిజనులు అంటూ కీలక కామెంట్స్ చేశాడు. 500 ఏళ్ల క్రితం గిరిజనులు ఘర్షణ పడినట్లుగా కశ్మీర్‌లో టెర్రరిస్టులు  దాడులు, విధ్వంసం సృష్టిస్తూ ఇప్పటికీ అలా కామన్ సెన్స్ లేకుండా, బుద్ధి లేకుండా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటూ కామెంట్స్ చేశాడు. దీంతో అప్పటినుంచి విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Advertisment
తాజా కథనాలు