BIG BREAKING: దివ్వెల మాధురికి బిగ్ షాక్.. బిగ్బాస్పై పోలీస్ కేసు?

: స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు పెద్ద షాక్ తగిలింది. షోను నిలిపివేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.

New Update
bigg boss 9 telugu

bigg boss 9 telugu

BIG BREAKING:  స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు పెద్ద షాక్ తగిలింది. షోను నిలిపివేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. గజ్వేల్ కు చెందిన కమ్మరి. శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా షో ఉందంటూ ఆరోపిస్తున్నారు.  బిగ్ బాస్ కు సెలెక్ట్ ఆయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదని, సమాజం సిగ్గుపడే విధంగా షోను నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు.  దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో చేసిన విధంగానే ఇక్కడ కూడా బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాగార్జున ఇలాంటి షోలు కాకుండా కాస్త సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.  ప్రభుత్వం వెంటనే షో పై కఠిన చర్యలు తీసుకోవాలని ..  లేదంటే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి బిగ్ బాస్ ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.  

Also Read: Bigg Boss 9 Telugu: టాస్క్ లో దుమ్మురేపిన దువ్వాడ మాధురి.. దెబ్బకు భరణి ఎలిమినేట్!

Advertisment
తాజా కథనాలు