Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌజ్ లో ఈ వారం కెప్టెన్సీ ఫైర్ మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్స్ అందరూ కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. ఫైర్ స్ట్రామ్స్ వర్సెస్ ఎక్స్ కంటెస్టెంట్స్ కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఇందులో ఫైర్ స్ట్రామ్ కంటెస్టెంట్స్ .. వారు ఎంచుకున్న ఎక్స్ కంటెస్టెంట్స్ కలిసి టాస్క్ లో పోటీపడాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలిపారు. భరణి, దివ్య, తనూజ, సంజన, సుమన్ శెట్టి ఒక టీమ్ కాగా.. దివ్వెల మాధురి, గౌరవ్ గుప్తా, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి, అయేషా, నిఖిల్ నాయర్ ఒక టీమ్ గా ఆడారు. సెంటర్ పాయింట్ లో ఉన్న బాల్ ని ఎవరు ముందుగా గోల్ చేస్తారు అనేది ఈ టాస్క్.
భరణి అవుట్
ఈ టాస్క్ లో దివ్వెల మాధురి, చిట్టి పికిల్స్ రెచ్చిపోయారు. చిట్టి పికిల్స్ రమ్య మోక్ష భరణి వంటి భారీ కటౌట్లను కూడా తన కండ బలంతో వెనక్కి నెట్టిసి దుమ్మురేపింది. మొదటి రౌండ్ లో దివ్వెల మాధురి టీమ్ ముందుగా గోల్ చేసినట్లుగా ప్రోమోలో కనిపిచింది. గోల్ చేసిన ఆపోజిట్ టీమ్ నుంచి ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలిపారు. దీంతో దివ్వెల మాధురి భరణిని గేమ్ నుంచి ఔట్ చేసి అందరికీ షాకిచ్చింది.
Also Read: Sai Durga Tej : నేను ఈ స్టేజీ మీద ఉండటానికి ఆ ముగ్గురే కారణం.. స్టేజ్ పై సాయితేజ్ ఎమోషనల్