Poola Chokka: యూట్యూబర్ 'పూలచొక్కా' పై పోలీస్ కేసు!

పాపులర్ తెలుగు యూట్యూబర్ పూలచొక్కా నవీన్ పై 'వర్జిన్ బాయ్స్' సినిమా నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 40 వేలు ఇస్తేనే పాజిటివ్ రివ్యూ ఇస్తానని.. లేదంటే నెగిటివ్ రివ్యూ ఇస్తానని తమను బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపాడు. నిర్మాత ఫిర్యాదు మేరకు పూలచొక్కా పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.

New Update
poola chokka naveen

poola chokka naveen

Poola Chokka: పాపులర్ తెలుగు యూట్యూబర్  పూలచొక్కా నవీన్ పై  'వర్జిన్ బాయ్స్ ' సినిమా నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 40 వేలు ఇస్తేనే పాజిటివ్ రివ్యూ ఇస్తానని.. లేదంటే నెగిటివ్ రివ్యూ ఇస్తానని తమను బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపాడు. నిర్మాత ఫిర్యాదు మేరకు పూలచొక్కా పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. కాసేపు విచారించిన తర్వాత మళ్ళీ వదిలేసినట్లు సమాచారం.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అసలేం జరిగింది.. 

అయితే  యూట్యూబ్ ఫాలో అయ్యే వారందరికీ  'పూల చొక్కా' నవీన్ గురించి తెలిసే ఉంటుంది. సినిమాలు రివ్యూలు, కరెంట్ టాపిక్స్ కి సంబంధించిన వీడియోల చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా రివ్యూస్ తో బాగా ఫేమస్! ఇతడి రివ్యూ కోసం వెయిట్ చేసే ఫాలోవర్లు కూడా ఉన్నారు.

కాగా, ఇటీవలే  'వర్జిన్ బాయ్స్'  అనే సినిమాకు  పూలచొక్కా చెప్పిన రివ్యూ వివాదాస్పదంగా మారింది. ''ఇది ఒక కథ లేకుండా తీసిన సినిమా.. చూస్తే రిలాక్స్  కాదు, ఫుల్  బోర్'' అంటూ రివ్యూ ఇచ్చాడు. అలాగే తన రేటింగ్ కాన్సెప్ట్ ప్రకారం సినిమాకు 'సగం(1/2) టమోటో' ఇచ్చాడు. దీని ప్రకారం సినిమా పూర్తిగా నిరాశపరించిందని అర్థం! దీంతో వర్జిన్ బాయ్స్ నిర్మాత  రాజా దారపునేని పూల చొక్కా రివ్యూ పై తీవ్రంగా స్పందించాడు. వాడెవడో పూల చొక్కా అంటా.. సినిమా చూడకుండానే రేటింగ్ ఇచ్చాడు అంటూ ఫైర్ అయ్యాడు. అనంతరం పూల చొక్కా పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

పూల చొక్కా క్లారిటీ 

ఇదిలా ఉంటే ఉంటే.. ఈ విషయానికి సంబంధించి పూలచొక్కా ఇప్పటికే తన యూట్యూబ్ ఛానెల్ లో స్పందించారు. తాను ఇప్పటివరకు ఎలాంటి పెయిడ్ రివ్యూస్ చేయలేదని, అలాగే రివ్యూస్ చెప్పాడని ఎవరినీ డబ్బులు ఆగడలేదని తెలిపారు. ఇంకా చెప్పాలంటే.. కొంతమంది నిర్మాతలే తనకు డబ్బులిస్తామని.. పాజిటివ్ రివ్యూ చెప్పాలని అడిగినట్లు వెల్లడించారు.  తాను ఎప్పుడు జెన్యూన్ రివ్యూ మాత్రమే చెప్తానని క్లారిటీ ఇచ్చాడు. 

Also Read: HBD Soundarya: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన సౌందర్య! బర్త్ డే స్పెషల్

Advertisment
తాజా కథనాలు