HBD Soundarya: అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ ముద్ర వేసుకుంది దివంగత నటి సౌందర్య. అద్భుతమైన నటన, అందం, అంతకుమించిన వ్యక్తిత్వంతో ప్రతిఒక్కరి ఫేవరేట్ గా నిలిచిపోయింది. కేవలం 12 సంవత్సరాల సినీ కెరీర్ లో 100 పైగా సినిమాల్లో నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. సౌందర్య కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాలేదు.. "అమ్మోరు", "పవిత్ర బంధం", "అంతఃపురం", "రాజా", "అంతఃపురం" వంటి హోమ్లీ పాత్రలతో ప్రతి ఇంట్లో అమ్మాయిలా మారిపోయింది. దురదృష్టవశాత్తు 2004 ఏప్రిల్ 17న ఆమె అకాల మరణం సినీ లోకానికి, అభిమానులకు తీరని లోటు!
సౌందర్య మరణించి రెండు దశాబ్దాలు దాటినా.. ఆమె నటన, సినిమాలు, వ్యక్తిత్వంతో ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో బ్రతికే ఉంది. నేడు సౌందర్య పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
సౌందర్య అసలు పేరు..
తెరపై అందరికీ ఆమె పేరు సౌందర్య అని మాత్రమే తెలుసు. కానీ ఆమె అసలు పేరు చాలా తక్కువ మందికే తెలుసు. సౌందర్య అసలు పేరు సౌమ్యా సత్యనారాయణ.
ఎం. బీబీఎస్
సౌందర్య సినిమాల్లోకి రాకముందు ఎం. బీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. చదువు పూర్తి చేసుకొని డాక్టర్ అవ్వాలని అనుకుంది. కానీ చదువు మధ్యలోనే సినిమా ఆఫర్లు రావడంతో ఆమె కెరీర్ యాక్టింగ్ వైపు మళ్లింది.
సమాజ సేవ
నటిగా మాత్రమే వ్యక్తిత్వంలోనూ సౌందర్య ముందుండేవారు. సామజిక సేవపట్ల ఎంతో ఆసక్తిని చూపించేవారు. ఒక ఆనాథాశ్రమాన్ని నడిపించారు. అంతేకాదు తన స్వంత గ్రామం అయిన కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ముళబాగిలు తాలూకాలోని గంగిగుంటె గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేశారు.
అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్
సౌందర్య సమాజ సేవ ఆశయాలను కొనసాగించాలని ఆమె మరణం తర్వాత ఆమె కుటుంబం 'అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' అనే ప్రారంభించారు.
మరణ సమయంలో గర్భవతి
సౌందర్య గురించి చాలా తక్కువ మందికి తెలిసిన విషాదరక విషయమేంటంటే.. విమాన ప్రమాదంలో మరణించినప్పుడు ఆమె రెండు నెలల గర్భవతిగా ఉన్నారు.
చనిపోయే ముందు సైన్ చేసిన ప్రాజెక్ట్
సౌందర్య చనిపోయే ముందు "కమ్లి" అనే సినిమాను నిర్మించి, నటించాలని అనుకున్నారు.
రాజకీయాల్లోకి
సామాజిక సేవ చేయాలనే కృషితో సౌందర్య రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. అలా 2004లో ఆమె BJP చేరి.. ఆ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగానే విమాన ప్రమాదంలో చనిపోయింది. సౌందర్య అకాల మరణంతో సమాజానికి సేవ చేయాలనే ఆమె ఆశయం.. తీరని కలగా మిగిలిపోయింది.