Peddi Movie: 'రంగస్థలం' తర్వాత రామలక్ష్మి - చిట్టిబాబు మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ లో మెరవనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సామ్ 'పుష్ప 2' లో 'ఊ అంటావా' పాటతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఇప్పుడు 'పెద్ది' లో కూడా తన డాన్స్ తో అదరగొట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా సాగే ఈ కథలో.. సామ్ స్పెషల్ సాంగ్ సినిమాకు మరింత శక్తిని, గ్లామర్ ను జోడించనుంది. చాలా కాలం తర్వాత సామ్ బిగ్ స్క్రీన్ పై కనిపించబోతుందనే వార్త ఆమె ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. అంతేకాదు 'రంగస్థలం' లో రామలక్ష్మి- చిట్టిబాబుగా సామ్, చరణ్ కెమిస్ట్రీ ఆకట్టుకోగా.. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి సందడి చేయడం ఆసక్తిగా మారింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే రామ్ చరణ్- సమంత ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి!
🔥🎶 BIG NEWS from #Peddi!
— Deva (@DevaReply) August 9, 2025
Director Buchhi Babu planning a SPECIAL SONG with sizzling beauty Samantha 💃✨
Ram Charan x Samantha reunion after Rangasthalam? Fans, get ready! 🚀 #RamCharan#SamanthaRuthPrabhu
(Source- cine Josh) pic.twitter.com/9wufzhqwqR
స్పోర్ట్స్ డ్రామాగా
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న 'పెద్ది' లో రామ్ చరణ్ గ్రామీణ యువకుడిగా, అథెల్ట్ గా కనిపించబోతున్నాడు.ఇప్పటికే 'ఫస్ట్ షాట్' గ్లింప్స్ మూవీపై భారీ క్రియేట్ చేసింది. ఇందులో రామ్ చరణ్ రస్టిక్ లుక్, డైలాగ్స్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచాయి. క్రికెట్ బ్యాట్ తో చరణ్ ఫస్ట్ షాట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. కొద్ది దీనికి సంబంధించిన రీల్ వీడియోలు, రిక్రియేషన్ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉండడంతో..మద్యమద్యలో మూవీ అప్డేట్స్ వదులుతూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు మేకర్స్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ తో పాటు పలు లొకేషన్లలో చిత్రీకరణ చేశారు. నవంబర్ 2025 నాటికి రామ్ చరణ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తవనున్నట్లు సమాచారం. 'గేమ్ చేంజర్' డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లే ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్ చరణ్ జోడీగా నటిస్తోంది. తెలుగులో జాన్వీ చేస్తున్న రెండవ సినిమా ఇది. ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. 'ఉప్పెన' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబుకు ఇది రెండవ సినిమా.