/rtv/media/media_files/2025/09/27/og-day-2-collections-2025-09-27-20-39-28.jpg)
OG Day 2 Collections
OG Day 2 Collections: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజీత్(Director Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా OG బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య DVV నిర్మించిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజే భారీ వసూళ్లు సాధించింది.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
OG Day 2 Nizam Collections
OG తొలి రోజు నైజాం ప్రాంతంలో రూ. 24 కోట్లు (షేర్) వసూలు చేయగా, రెండో రోజు కూడా సినిమా స్థిరంగా కొనసాగింది. రెండో రోజు షేర్ రూ. 5.9 కోట్లు (GST సహా) వసూలవ్వడం విశేషం. రెండు రోజుల కలిపి నైజాం లో షేర్ మొత్తంగా రూ. 30 కోట్లు దాటింది.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
OG, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. టాలీవుడ్‌లో పుష్ప 2 తర్వాత OGకి ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో రెండవ అత్యధిక ఓపెనింగ్ వచ్చిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read: ‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
ఇక సినిమాపై ఆదివారం (మూడో రోజు) వసూళ్లకు సంబంధించి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజు ముగిసేలోపు సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఈ సినిమాలో ఇమ్రాన్ హాష్మీ విలన్ పాత్రలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సంగీతాన్ని SS తమన్ అందించారు. మొత్తంగా చూస్తే, OG బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ పవన్ మార్క్ మాస్ రేంజ్‌ను మరోసారి ప్రూవ్ చేస్తోంది.