/rtv/media/media_files/2025/07/24/veeramallu-2025-07-24-17-25-19.jpg)
Hari Hara Veera Mallu Day 1 Collections
Hari Hara Veera Mallu Day 1 Collections: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'హరిహర వీరమల్లు' చిత్రం భారీ అంచనాల మధ్య ఈరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. రూ. 250 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు పర్మిషన్స్ కూడా ఇచ్చాయి. అంతేకాకుండా ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ వేసేందుకు కూడా అవకాశాలు ఇచ్చాయి. దాంతో భారీగా ప్రీమియర్స్ వేసారు. ప్రీమియర్ షోకు కలెక్షన్ల వర్షం కురిసినట్లుగా తెలుస్తోంది. ప్రీమియర్స్ ద్వారానే సినిమా రూ. 11 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్లు, ఓవర్సిస్ లో రూ. 4 కోట్లు రాబట్టినట్లుగా సమాచారం. అలాగే సినిమా మొదటి రోజే రూ. 80 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మిశ్రమ స్పందన
'హరిహర వీరమల్లు' 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ. పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే యోధుడి పాత్రను పోషించారు. మొఘల్ పాలకుల చేతుల్లో బందీగా ఉన్న ఒక నగరాన్ని విముక్తి చేయడానికి, అణగారిన ప్రజలలో ఆశను నింపడానికి వీరమల్లు విలువైన కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడానికి ఒక సాహసోపేతమైన మిషన్‌ను చేపడతాడు. విడుదలైన మొదటి రోజు, సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని కొందరు ప్రశంసించగా, వీఎఫ్‌ఎక్స్ నాణ్యత, కథనం కొంత నిరాశపరిచిందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ఈ చిత్రం 'హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' (Sword vs Spirit) పేరుతో విడుదలైంది. క్లైమాక్స్‌లో దీని సీక్వెల్ 'హరిహర వీరమల్లు: పార్ట్ 2 – బ్యాటిల్‌ఫీల్డ్' (Yuddhabhoomi) టైటిల్‌ను వెల్లడించారు. ఇక ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు చివరి నాటికి ఓటీటీలో స్ట్రీమింగ్ కావచ్చు.