అప్పుడు పొగిడి, ఇప్పుడు తిట్టి.. పవన్, ప్రకాష్ రాజ్ పంచాయితీకి కారణమిదే?

పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య వార్ నడుస్తోంది. తిరుమల లడ్డూ కల్తీ అంశమై వీరిమధ్య వైరం మొదలైంది. నిజానికి ఒకప్పుడు వీళ్ళు మంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు పవన్ బీజేపీకి దగ్గరవ్వడం ప్రకాష్ రాజ్ కు నచ్చడం లేదు. అందుకే ఆయన్ని టార్గెట్ చేసినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

pk
New Update

గత కొన్ని రోజులుగా అటు సోషల్ మీడియాలో ఇటు రాజకీయ వర్గాల్లో పవన్ కళ్యాణ్ - ప్రకాష్ రాజ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ కల్తీ అంశమై వీరిమధ్య వైరం మొదలైంది. నిజానికి ఒకప్పుడు వీళ్ళిద్దరూ మంచి సన్నిహితులుగా ఉండేవారు. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ కలిసి బద్రి, సుస్వాగతం, జల్సా, కెమెరామెన్ గంగతో రాంబాబు, వకీల్ సాబ్ తదితర సినిమాల్లో నటించారు. 

అయితే వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాల్లో ప్రకాష్ రాజ్ ఎక్కువగా పవన్ కు ప్రతినాయకుడి పాత్రలోనే కనిపించారు. నిజ జీవితంలో మాత్రం వీరి మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉండేది. ముఖ్యంగా మా అసోసియేషన్ సమయంలో మెగా ఫ్యామిలీ అంతా ప్రకాష్ రాజ్ ను సపోర్ట్ చేసింది. అదే సమయంలో మంచు విష్ణు.. పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తే, ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. 

లడ్డూ తెచ్చిన తంటా..

పవన్ కళ్యాణ్ గొప్ప హీరో, ఆయన సినిమా ఓపెనింగ్స్ అంత ఉండవు నీ సినిమా కలెక్షన్స్ అంటూ మంచు విష్ణుపై ఫైర్ అయ్యాడు. అలాగే పవన్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని కోరుకున్న వారిలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. కట్ చేస్తే.. ఇప్పుడు వీళ్ళ మధ్య వైరం మొదలైంది. తిరుమల లడ్డూ కల్తీ అంశమై ప్రకాష్ రాజ్ ఫస్ట్ టైం రియాక్ట్ అవుతూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాడు.

Also Read : నా పిల్లలు సినిమాల్లోకా? కరెక్ట్ కాదు.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

' తిరుపతి లడ్డూ వివాదం మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే జరిగింది.. దోషుల్ని పట్టుకోండి.. జాతీయ స్థాయిలో చర్చలెందుకు లేవనెత్తుతున్నారు' అని అన్నాడు. దానికి పవన్.. ప్రకాశ్‌రాజ్‌.. విషయం తెలుసుకుని మాట్లాడండి.. సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు' అంటూ కౌంటర్ ఇచ్చాడు. 

దీంతో పవన్ కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ గారు.. ఇప్పుడే మీ ప్రెస్‌మీట్‌ చూశా. నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా.  ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి' అని అన్నాడు. ఆ తర్వాత కూడా పవన్ ను టార్గెట్ చేస్తూ వరుసగా ట్వీట్స్ పెడుతూనే వస్తున్నాడు.

అక్కడే చెడిందా?

నిజానికి పవన్ కళ్యాణ్ ఏదైనా మాట మాట్లాడితే చాలు ప్రకాష్ రాజ్ వెంటనే ఒక ట్వీట్ పెడతాడు. అతనికి సంబంధం లేని విషయం అయినా కూడా ఏదో కలిగించుకొని మరి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటల్లో తప్పుంది అనే రేంజ్ లో ఆయన ట్వీట్ చేస్తారు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. అలాగే బిజెపి పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. 

Also Read : 'మహారాజ' 100 డేస్ సెలెబ్రేషన్స్.. డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్

కాబట్టి ప్రకాష్ రాజ్ కి అది నచ్చడం లేదు. మొదటి నుంచి కూడా ప్రకాష్ రాజ్ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటు వచ్చాడు. కాబట్టి అవకాశం దొరికిన ప్రతిసారి బిజెపి మీద కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉండేవాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పార్టీకి దగ్గర అవుతుండడం తనకు నచ్చకపోవడం వల్లే అనవసరపు ట్వీట్లు చేస్తున్నాడు అంటూ కొందరు సినీ, రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. మరి వీళ్ళ మధ్య వైరం సర్దుమణిగేది ఎప్పుడో దాన్ని కాలమే నిర్ణయించాలి.

#pawan-kalyan #prakash-raj
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe